సూపర్‌‌‌‌ సిక్స్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు టీమిండియా

సూపర్‌‌‌‌ సిక్స్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు టీమిండియా

బెనోని (సౌతాఫ్రికా): విమెన్స్‌‌‌‌ అండర్‌‌‌‌19 టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా హ్యాట్రిక్‌‌‌‌ విక్టరీతో  సూపర్‌‌‌‌ సిక్స్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌–డి చివరి మ్యాచ్‌‌‌‌లో ఇండియా 83 రన్స్‌‌‌‌ తేడాతో స్కాట్లాండ్‌‌‌‌ను చిత్తు చేసింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 149/4 స్కోరు చేసింది. హైదరాబాదీ గొంగడి త్రిష (57) ఫిఫ్టీతో సత్తా చాటింది. ఛేజింగ్‌‌‌‌లో స్కాట్లాండ్‌‌‌‌ 13.1 ఓవర్లలో 66  రన్స్‌‌‌‌కే కుప్పకూలింది.