పార్లమెంటు మన దేశ ప్రజాస్వామ్య దేవాలయం

పార్లమెంటు మన దేశ ప్రజాస్వామ్య దేవాలయం

న్యూఢిల్లీ: పార్లమెంట్ అనేది మన దేశ ప్రజాస్వామ్య దేవాలయమని రాష్ట్రపతి రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ కోవింద్ అన్నారు. ప్రజల సంక్షేమం గురించి చర్చించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అత్యున్నత వేదిక అని చెప్పారు. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చ జరగకుండానే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. 75వ ఇండిపెండెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా శనివారం దేశప్రజలను ఉద్దేశించి కోవింద్ మాట్లాడారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నుంచి మనం ఇంకా కోలుకోలేదని, రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ చట్టాల గురించి ప్రస్తావించిన కోవింద్.. రైతులను అగ్రికల్చరల్ మార్కెటింగ్ రీఫార్మ్స్ ఎంపవర్ చేస్తాయని, పంటలకు మద్దతు ధరలను వచ్చేలా తోడ్పాటు అందిస్తాయని చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. 
ప్రాచీన కాలంలోనే ప్రజాస్వామ్య మూలాలు

‘‘మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు.. ఇండియాలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించదని కొందరు భావించారు. ప్రాచీన కాలంలోనే ఈ మట్టిలో ప్రజాస్వామ్యం మూలాలు ఉన్నాయి. ఈ విషయం వాళ్లు తెలుసుకోవాలి’’ అని ప్రెసిడెంట్ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోవింద్ చెప్పారు. ‘‘మనం పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడాప్ట్ చేసుకున్నాం. అందుకే పార్లమెంటు.. మనకు ప్రజాస్వామ్య దేవాలయం’’ అని చెప్పారు. త్వరలోనే కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రాబోతోందని, ఇది భారతీయులందరికీ గర్వకారణమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అన్నారు.

దేశాభివృద్ధి కోసం పనిచేద్దాం: ఉప రాష్ట్రపతి 

న్యూఢిల్లీ, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వరాజ్యాన్ని సాధించుకొని75 ఏండ్ల మైలురాయిని చేరుకుంటున్న ఈ సందర్భంలో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో..  ధైర్యం, దేశభక్తిని ప్రేరణగా తీసుకుందామని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని చెప్పారు. మనకున్న దాంట్లో నలుగురితో పంచుకోవడం, ఇతరుల సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ పెట్టడం వంటి మన దేశ విలువలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పౌరులందరికీ భద్రత, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే రాజ్యంగపరమైన ఆదర్శాన్ని సాధించేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ఓ స్థాయిలో నిలబెట్టేందుకు అందరం పనిచేసే దిశగా ప్రతిజ్ఞ చేసుకోవాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.