టీమిండియా చెత్త రికార్డు 

టీమిండియా చెత్త రికార్డు 

ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకే కుప్పకూలిపోయింది. టాస్‌ గెలవడం  తప్ప టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు. పించ్ పై బంతి ఎలా టర్న్ అవుతుందో తెలియక టీమిండియా బ్యాటర్లు తడబడి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో తక్కువ స్కోరుకే టీమిండియా చాప చుట్టేసింది. ఈ క్రమంలో టీమిండియా పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. టీమిండియా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం గత 15 ఏళ్లలో ఇది నాలుగోసారి. గతంలో 2008లో(అహ్మదాబాద్‌) సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో 76 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత 2017 పుణేలో ఆస్ట్రేలియాతో టెస్టులో 105 పరుగులకు కుప్పకూలింది. మళ్లీ అదే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇప్పుడు ఇండోర్ లో 109 పరుగులకు ఆలౌట్‌ అయింది.