పెట్రోల్ డీజిల్ పై ఎగుమతి సుంకాలు తగ్గించిన కేంద్రం... దేశంలో ధరల పరిస్థితి ఏంటి..?

పెట్రోల్ డీజిల్ పై ఎగుమతి సుంకాలు తగ్గించిన కేంద్రం... దేశంలో ధరల పరిస్థితి ఏంటి..?

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్ ఫాల్ గెయిన్స్ ను తగ్గించింది ప్రభుత్వం. ఇంటర్నేషనల్ మర్కెట్స్ లో ధరల మార్పులు, ముడి చమురు ధరల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. జూన్ 1 నుంచి సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపింది ప్రభుత్వం.

తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్ పై విండ్ ఫాల్ గెయిన్స్ పన్నును లీటర్ కు రూ.3 నుంచి రూ.1.50కి తగ్గించింది ప్రభుత్వం. డీజిల్ పై లీటర్ కు 16.50 నుంచి రూ.13.50కి తగ్గించింది. దీంతో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై విండ్ ఫాల్ గెయిన్స్ లీటర్ కు రూ.16.50 నుంచి రూ.9.50కి తగ్గించినట్లు తెలిపింది ప్రభుత్వం.

దేశీయ మార్కెట్ పై ప్రభావం...?

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం దేశీయ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపదు. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై అమల్లో ఉన్న సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది కేంద్రం. ముడి చమురు, పెట్రోల్, డీజిల్ ATF ల సగటు అంతర్జాతీయ ధరల ఆధారంగా విండ్ ఫాల్ పన్ను రేట్లను నిర్ణయిస్తారు. ఈ రేట్లు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించి సవరిస్తుంటారు. 2026 మే 16న చివరిసారిగా రేట్లు మారాయి.

అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సప్లైలో అంతరాయంపై భయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ముడి చమురు ధరలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి.