గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు వికెట్లు కోసం శ్రమిస్తున్నారు. రెండో ఆటలో భాగంగా తొలి సెషన్ లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయారు. తొలి రోజు 6 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించినా రెండో రోజు సేనురన్ ముత్తుసామి, కైల్ వెర్రెయిన్ పట్టుదలకు తలవంచారు. మరోవైపు సౌతాఫ్రికా.. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకొని తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. రెండో రోజు టీ విరామానికి 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. క్రీజ్ లో సేనురన్ ముత్తుసామి (56), కైల్ వెర్రెయిన్(38) ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. జడేజా, సిరాజ్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది.
6 వికెట్ల నష్టానికి 247 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్ లో చాలా జాగ్రత్తగా ఆడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి గంట పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యారు. ఆ తర్వాత పరుగుల వేగం పెంచిన వీరిద్దరి జోడీ జట్టు స్కోర్ ను 300 పరుగులు దాటించారు. ఈ క్రమంలో ముత్తుస్వామి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో వికెట్ కీపర్ వెర్రెయిన్ ఓపిగ్గా ఆడడంతో ఈ సెషన్ లో ఇండియాకు వికెట్ రాలేదు. రెండో రోజు తొలి సెషన్ లో 69 పరుగులు రాబట్టిన సౌతాఫ్రికా వికెట్ ఏమీ కోల్పోలేదు.
తొలి రోజు సగం సగం:
తొలి రోజు టీమిండియా బౌలర్లు తడబడి పుంజుకున్నారు. తొలి రెండ్ సెషన్ లలో విఫలమైన బౌలర్లు.. చివరి సెషన్ లో నాలుగు వికెట్లు పడగొట్టి తొలి రోజు ఆధిపత్యం చూపించారు. మరోవైపు సౌతాఫ్రికా కూడా బ్యాటింగ్ లో రాణించి తొలి రోజును సంతృప్తికరంగా ముగించింది. కెప్టెన్ బవుమా (41), స్టబ్స్ (49) భాగస్వామ్యంతో పాటు ఓపెనర్లు రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
SOUTH AFRICA 316/6 ON DAY 2 TEA.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2025
- No wickets for India in the opening session. pic.twitter.com/VZWqgr8IKw
