V6 News

పాత బండ్ల కోసం కొత్త పాలసీ.. లాభాలివే…

పాత బండ్ల కోసం కొత్త పాలసీ.. లాభాలివే…

న్యూఢిల్లీ: ఆటోమొబైల్​ కంపెనీలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్క్రాపేజీ​ పాలసీని కేంద్రం​ ప్రకటించింది. పాత, కాలుష్యకారక వెహికల్స్​ను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని వాలంటరీగా అమలు చేస్తారు. ఓనర్​కు​ ఇష్టమైతేనే పాత వెహికల్​ను వదులుకోవచ్చు. పర్సనల్​ వెహికల్స్​కు 20 ఏళ్ల తర్వాత, కమర్షియల్​వెహికల్స్​కు 15 ఏళ్ల తరువాత ఫిట్​నెస్ టెస్ట్​చేస్తారు. వెహికల్​ బాగా లేకుంటే స్క్రాప్​గా మారుస్తారు. బడ్జెట్‌లో దీనిపై ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఆ ప్రసంగం ​ముగిశాక కేంద్ర ట్రాన్స్​పోర్ట్​ మంత్రి నితిన్​ గడ్కరీ మాట్లాడుతూ కోటి లైట్, మీడియం, హెవీ మోటార్​ వెహికల్స్​కు స్క్రాపేజ్​ పాలసీ వర్తిస్తుందని, త్వరలోనే పూర్తి సమాచారం ఇస్తామని  చెప్పారు.

స్క్రాపేజీ పాలసీ అంటే…

ఎలక్ట్రిక్​ వెహికల్స్​ను ఎంకరేజ్​చేయడానికి మోటార్​ వెహికల్​ చట్టంలో మార్పులు చేయాలని 2019లో కేంద్ర ట్రాన్స్​పోర్ట్​ డిపార్ట్మెంట్ ఒక పాలసీని తయారు చేసింది.15 ఏళ్లకు పైబడిన వెహికల్స్​ను తుక్కుగా మార్చడం, ఆటో ఇండస్ట్రీకి బూస్ట్​ ఇవ్వాలనేది దీని ఉద్దేశం. ఈ విధానంలో పాత వెహికల్​ను వదులుకున్న వారికి ఇన్సెంటివ్స్.  రోడ్​ ట్యాక్స్, రిజిస్ట్రేషన్​ ఫీజు​ రద్దు, వెహికిల్​ రేటుపై ఒకశాతం డిస్కౌంట్​ వంటి మినహాయింపులు ఉంటాయి. ఈ పాలసీ అమలు కోసం కేంద్ర రవాణా శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం 15ఏండ్లు నిండినవాహనాలకు రీ–రిజిస్ట్రేషన్ చేయించుకుని నడిపిస్తున్నారు . ఇలా 30–40 ఏండ్ల వరకు నడుస్తున్నాయి. కొత్త విధానంతో దీనికి పుల్ స్టాప్ పడుతుంది.  ప్రస్తుతం దేశంలో 20 ఏళ్లు నిండిన  లైట్​ మోటార్​ వెహికల్స్​ 51లక్షలు, పదిహేనేళ్లు నిండినవి 34 లక్షలు,  పదిహేనేళ్లు నిండిన హెవీ మోటార్​ వెహికల్స్ 17 లక్షలు ఉన్నాయి. వీటికి ఫిట్​నెస్​ సర్టిఫికెట్స్ లేవు కాబట్టి తుక్కుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే,  ఫిట్​నెట్​ టెస్టు ఫెయిలైతే గ్రీన్​ట్యాక్స్​ వేస్తామని కేంద్ర ప్రభుత్వం గత నెల ప్రకటించింది. రోడ్​ ట్యాక్స్​లో 25 శాతం వరకు గ్రీన్​ట్యాక్స్​ ఉంటుందని తెలిపింది. సీఎన్జీ, ఎల్పీజీ వంటి వెహికిల్స్​కు దీని నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పింది.

ఇవీ లాభాలు

  • స్క్రాపేజీ పాలసీతో ఇండియాను ఆటోమొబైల్ హబ్ చేయొచ్చని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. పాత వెహికల్స్ విడిభాగాలను కొత్త వాటి తయారీకి వాడుకోవచ్చు.
    ఫలితంగా ప్రొడ్యూసింగ్ కాస్ట్ తగ్గుతుంది.
  • పాత వెహికల్స్​ రోడ్లపైకి రాకపోవడం వల్ల పొల్యూషన్​ తగ్గుతుంది. రోడ్​సేఫ్టీ పెరుగుతుంది. పెట్రోల్​, డీజిల్​ వాడకం తగ్గుతుంది.  దీనివల్ల ప్రభుత్వానికి ఫారిన్​ కరెన్సీ ఆదా అవుతుంది.
  • ఈ పాలసీతో కొత్త వెహికల్స్​ అమ్మకాలు పెరిగే చాన్సులు ఉంటాయి కాబట్టి మరిన్ని కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు పెట్టడానికి ముందుకు వస్తాయి.
  • ఆటో సెక్టార్​లోకి దాదాపు రూ.10 వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్లు వస్తాయని అంచనా. 50 వేల మందికి జాబ్స్ దొరుకుతాయని
    మంత్రి గడ్కరీ అన్నారు.
  • ప్రస్తుతం ఇండియా ఆటోమొబైల్​ ఇండస్ట్రీ ఏడాది టర్నోవర్​ రూ.4.5 లక్షల కోట్లు కాగా, స్క్రాపేజ్​ పాలసీ అమల్లోకి వస్తే రూ.ఆరు లక్షల కోట్లకు పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.