
న్యూఢిల్లీ: దేశ ఫారెక్స్ నిల్వలు ఈ నెల 18 తో ముగిసిన వారంలో 7.28 బిలియన్ డాలర్లు పడి 594.90 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత ఆరు నెలల్లో ఇంత ఎక్కువగా తగ్గడం ఇదే మొదటిసారి. ఆగస్టు 11 తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్‌లు 708 మిలియన్ డాలర్లు పెరిగి 602.161 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం, ఈ నెల 18 తో ముగిసిన వారంలో ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 6,613 మిలియన్ డాలర్లు తగ్గి 527.786 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి.
గోల్డ్ రిజర్వ్‌లు 515 మిలియన్ డాలర్లు పడి 43.824 బిలియన్ డాలర్లకు, ఎస్‌డీఆర్‌లు 119 మిలియన్ డాలర్లు తగ్గి 18.205 బిలియన్ డాలర్లకు పడ్డాయి. అక్టోబర్, 2021 లో ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల వద్ద ఆల్ టైమ్ హై టచ్ చేశాయి.