రూ.20 సిగరెట్ లైటర్లు బ్యాన్.. ఎందుకంటే...

రూ.20 సిగరెట్ లైటర్లు బ్యాన్.. ఎందుకంటే...

భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం సిగరెట్​ ప్రేమికులను గాయపరిచింది. అదేంటంటారా.. రూ.20 లోపు ధర కలిగిన చైనా లైటర్లపై ఇండియా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసింది. దిగుమతులు అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.  లైటర్లపై దిగుమతి సుంకాన్ని ఉచితం నుంచి తొలగించి 'బ్యాన్​' కేటగిరీలో ఉంచారు. లైటర్​సీఐఎఫ్​(ధర, ఇన్సూరెన్స్​, సరకు రవాణా) రూ.20 కంటే ఎక్కువ ఉంటే నే ఆ లైటర్లను ఇండియాలో దిగుమతి చేసుకోవచ్చు. 

సీఐఎఫ్​ అంటే..

సీఐఎఫ్​ అంటే కాస్ట్​, ఇన్సూరెన్స్, ఫ్రేట్ అని అర్థం.  విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల ధర నిర్ణయించడానికి ఉపయోగపడే బిజినెస్​ వర్డ్ ఇది. రీఫిల్, నాన్​ రీఫిల్, గ్యాస్, పాకెట్​ లైటర్లపై గతంలోనే నిషేధం విధించారు. వీటి దిగుమతుల విలువ 2022–23 సంవత్సరానికి 6.6 మిలియన్​ డాలర్లు ఉండగా.. 2023 ఏప్రిల్​లో 1.3 మిలియన్​ డాలర్లకు చేరింది. ఇండియానే కాకుండా స్పెయిన్​, టర్కియే, యూఏఈ తదితర దేశాలు వీటిని దిగుమతి చేసుకునే లిస్టులో ఉండేవి. 

నాన్​రీఫిల్లబుల్​ లైటర్లు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తాయని, ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుందని వాటిని బ్యాన్​ చేయాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్​ గతంలోనే అన్నారు. భారత్​లో అగ్గిపెట్టెల తయారీ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. లైటర్ల రాకతో వాళ్ల బిజినెస్​ దెబ్బతింది. వాటిని నిషేధిస్తే అగ్గిపెట్టెల తయారీ ఇండస్ట్రీకి ఊతం ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.