V6 News

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టైటిల్ మనదే

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టైటిల్ మనదే

చాంపియన్స్ .. ఇండియా లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టైటిల్ సొంతం
రాణించిన యువరాజ్, యూసుఫ్ పఠాన్

రాయ్ పూర్ : క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఏళు్లు గడుస్తున్నా.. తమలో ఇంకా సత్తా తగ్గలేదని ఇండియా లెజెండ్స్ టీమ్ నిరూపించింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన సచిన్ కెప్టెన్సీలోని టీమ్.. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్లో ఇండియా లెజెండ్స్ 14 రన్స్ తేడాతో శీలంక లెజెండ్స్ పై గెలిచింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది. యువరాజ్ సింగ (41 బాల్స్ లో 4 ఫోర్లు , 4 సిక్స్ లు 60), యూసుఫ్ పఠాన్ (36 బాల్స్ లో 4 ఫోర్లు , 5 సిక్స్ లతో 62 నాటౌట్ ) ధనాధన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. సచిన్ (30) రాణించాడు. లీగ్ మ్యాచుల్లో దంచికొట్టిన వీరేంద్ర (10) ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. 35 రన్స్ కే రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా లెజెండ్స్ ను సచిన్,యువీ ఆదుకున్నారు. ముఖ్యంగా యువరాజ.. లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. పేసర్ , స్పిన్నర్ అనే తేడా లేకుండా నాలుగు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా మూడో వికెట్ కు 43 రన్స్ సమకూరడంతో ఇన్నింగ్స్ నిలబడింది. అయితే సచిన ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యూసుఫ్ పఠాన్ కూడా సునామీ ఇన్నింగ్స్  ఆడాడు. ఐదు సిక్సర్లతో రెచ్చిపోయాడు.