ప్రపంచ పోటీతత్వ సూచీలో మెరుగుపడ్డ భారత్

ప్రపంచ పోటీతత్వ సూచీలో మెరుగుపడ్డ భారత్

ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ‘పోటీతత్వ సూచీ’లో భారత్ గణనీయంగా పురోగమించింది. అంతకుముందు వరకు 43వ స్థానంలో ఉన్న భారత్.. 6 స్థానాలు పురోగమించి 37వ స్థానానికి చేరింది. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, వ్యాపార రంగానికి లభిస్తున్న ప్రోత్సాహం, ఉద్యోగ కల్పన వంటి అంశాలు ప్రాతిపదికగా స్విట్జర్లాండ్లోని ‘ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్’ సంస్థ ఈ సూచీని రూపొందించింది.  మొత్తం 63 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో మొదటి స్థానంలో  డెన్మార్క్  నిలిచింది. గతేడాది ఈ దేశం మూడో ర్యాంకులో ఉండేది. 2021 సంవత్సరంలో తొలి స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ .. ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది. సింగపూర్ ఐదో ర్యాంకు నుంచి మూడో ర్యాంకుకు చేరింది. తర్వాతి ర్యాంకుల్లో  స్వీడన్ (4), హాంకాంగ్ (5), నెదర్లాండ్స్ (6), తైవాన్ (7), ఫిన్లాండ్ (8), నార్వే (9), అమెరికా  (10) నిలిచాయి. ప్రత్యేకించి మన ఆసియా ఖండం నుంచి ఈ సూచీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన దేశాల జాబితాలో సింగపూర్ (3), హాంకాంగ్ (5), తైవాన్ (7), చైనా (17)  ఉన్నాయి.