అర్ధరాత్రి దాకా పాన్‌‌‌‌షాపులు ఓపెన్‌‌‌‌

అర్ధరాత్రి దాకా పాన్‌‌‌‌షాపులు ఓపెన్‌‌‌‌
  • ముగ్గురు నిర్వాహకులకు  జైలు శిక్ష

బషీర్ బాగ్, వెలుగు : అర్ధరాత్రి దాకా పాన్‌‌‌‌ షాపులు ఓపెన్‌‌‌‌ చేస్తున్న ముగ్గురు నిర్వాహకులకు కోర్టు జైలు శిక్ష విధించింది.  నారాయణగూడ అడ్మిన్ ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపిన ప్రకారం.. హైదర్‌‌‌‌గూడ, దత్తానగర్‌‌‌‌ ప్రాంతాల్లో రూల్స్ కు విరుద్ధంగా అర్ధరాత్రి దాకా పాన్‌‌‌‌ షాపులు తెరిచి ఉంచుతున్న మహమ్మద్‌‌‌‌ అతీక్‌‌‌‌(21)

మహమ్మద్‌‌‌‌ సల్మాన్‌‌‌‌(21), మహమ్మద్‌‌‌‌ అర్షద్‌‌‌‌ (32) లపై పెట్టీ కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా.. నాంపల్లి మనోరంజన్ కాంప్లెక్స్ ఐదో స్పెషల్‌‌‌‌ ఎంఎం కోర్టు జడ్జి 5 రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు అడ్మిన్‌‌‌‌ ఎస్ ఐ నరేష్‌‌‌‌ కుమార్‌‌‌‌ గురువారం తెలిపారు.