
- పిస్టల్ అమ్మేందుకు యత్నిస్తున్న యువకుడు అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు : పిస్టల్అమ్మేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని బాలానగర్ఎస్ వోటీ, జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కుత్బుల్లాపూర్పరిధి అయోధ్యనగర్‌కు చెందిన గుడ్డి వంశీకృష్ణ గౌడ్ (21)లిఫ్ట్టెక్నీషియన్. అతనికి మధ్య ప్రదేశ్ కు చెందిన విశాల్యాదవ్ఫేస్బుక్లో ఫ్రెండ్ గా పరిచయం అయ్యాడు. ఏడాదిగా వీరు ఫోన్లో మాట్లాడుకుంటుండగా.. విశాల్ తను ఆయుధాలు సప్లై చేస్తుంటానని, వాటిని హైదరాబాద్‌లో అమ్మితే భారీగా డబ్బు సంపాదించవచ్చని సూచించాడు.
దీంతో వంశీ కృష్ణఈజీమనీకి ఆశపడి ఆయుధాలు అమ్మేందుకు ఒప్పుకున్నాడు. ఒక పిస్టల్ నురూ.50వేలకు విశాల్ వద్ద కొనుగోలు చేసేందుకు వంశీకృష్ణ రూ.19వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. గత మార్చి 6న విశాల్ ఖాజీపేట్కు వచ్చి పిస్టల్ తెచ్చానని చెప్పాడు. వంశీ కృష్ణ తన బైక్‌పై వెళ్లి రూ.30వేలు చెల్లించి మూడు లైవ్రౌండ్ల పిస్టల్తీసుకుని సిటీకి వచ్చాడు. తెచ్చిన పిస్టల్‌ను రూ.2లక్షలకు, ఒక తూటా రూ.8వేలకు చొప్పున సిటీలో అమ్మేందుకు వంశీకృష్ణ ప్రయత్నిస్తున్నాడు.
బుధవారం రాత్రి చింతల్ వద్ద బాలానగర్ పోలీసుల చెకింగ్ ల్లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వంశీకృష్ణవద్ద మూడు రౌండ్ల పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గతంలో ఏమైనా ఆయుధాలు విక్రయించాడా ? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.