అవని రికార్డు గోల్డ్‌‌

అవని రికార్డు గోల్డ్‌‌
  • పారిస్‌‌ పారాలింపిక్స్‌‌కు అర్హత

న్యూఢిల్లీ: ఇండియా పారా షూటర్‌‌ అవని లేఖరా  పారా షూటింగ్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో వరల్డ్‌‌ రికార్డు స్కోరుతో గోల్డ్‌‌ మెడల్‌‌ గెలిచింది. ఫ్రాన్స్‌‌లోని చటౌరొక్స్‌‌లో మంగళవారం జరిగిన ఎస్‌‌హెచ్‌‌1 కేటగిరీ  విమెన్స్‌‌ 10 మీ. రైఫిల్‌‌ ఫైనల్లో 20 ఏళ్ల అవని 250.6 స్కోరుతో టాప్‌‌ ప్లేస్‌‌ సాధించింది. ఈ క్రమంలో 249.6 స్కోరుతో తన పేరిటే ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్‌‌ చేసింది. దాంతో పాటు  2024 పారిస్‌‌ పారాలింపిక్స్‌‌కు క్వాలిఫై అయిన తొలి ఇండియన్‌‌గా నిలిచింది. పోలెండ్‌‌కు చెందిన ఎమిలియ (247.6) సిల్వర్‌‌, స్వీడెన్‌‌ షూటర్‌‌ అనా నార్మన్‌‌ (225.6) బ్రాంజ్‌‌ గెలిచారు. తన కోచ్‌‌, ఎస్కార్ట్‌‌కు వీసా రాకపోవడంతో అవని మూడు రోజుల కిందట ఈ టోర్నీకి దూరమయ్యే పరిస్థితి ఎదుర్కొంది. కానీ, సాయ్‌‌, స్పోర్ట్స్‌‌ మినిస్ట్రీ వీసా సమస్యను పరిష్కరించడంతో బరిలోకి దిగిన ఆమె రికార్డు గోల్డ్‌‌తో సత్తా చాటింది. గతేడాది జరిగిన టోక్యో పారాలింపిక్స్‌‌లో లేఖరా గోల్డ్‌‌, బ్రాంజ్‌‌ నెగ్గి పారాలింపిక్స్‌‌లో రెండు పతకాలు సాధించిన ఇండియా తొలి మహిళగా రికార్డు సృష్టించింది.