పోస్టల్ డిపార్ట్​మెంట్​లో 1,899 ఖాళీలు

పోస్టల్ డిపార్ట్​మెంట్​లో 1,899 ఖాళీలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో రెగ్యులర్‌ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ ఖాళీల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్​ కోరుతోంది. 

ఖాళీలు: మొత్తం 1899 ఖాళీల్లో పోస్టల్ అసిస్టెంట్–598, సార్టింగ్ అసిస్టెంట్: 143, పోస్ట్‌మ్యాన్: 585, మెయిల్ గార్డ్: 3, ఎంటీఎస్‌: 570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 51; తెలంగాణ సర్కిల్‌లో 91 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్‌ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ; పోస్ట్​మ్యాన్/ మెయిల్ గార్డ్ పోస్టులకు పన్నెండో తరగతి; ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు 18- నుంచి 25 ఏండ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి -27 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: క్రీడా విజయాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్​ ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు www.indiapost.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.