బీభత్సంగా పెరుగుతున్న కరోనా.. ఒకే రోజు 5 వేల కేసులు

బీభత్సంగా పెరుగుతున్న కరోనా.. ఒకే రోజు 5 వేల కేసులు

దేశంలో కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ బుధవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 25 వేలు దాటాయి. 24 గంటల్లోనే 5 వేల 335 కేసులు నమోదు కావటంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. 24 గంటల్లోనే కరోనాతో 15 మంది చనిపోయినట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

దేశంలో రోజువారీ పాజిటివ్ రేటు 3.32 శాతానికి పెరగటం కూడా ఆందోళన కలిగిస్తుందని తన ప్రకటనలో స్పష్టం చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. పాజిటివ్ రేటు వారాంతానికి తీసుకుంటే మాత్రం అది 2.79 శాతంగా ఉంది. 

2023, ఏప్రిల్ ఒకటో తేదీన 2 వేల 994 కేసులు నమోదు కాగా.. ఏప్రిల్ 6వ తేదీ నాటికి 5 వేలు దాటాయి. రోజువారీగా కొత్త కేసులు 500 పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.