దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ నుంచి సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌

దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ నుంచి సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌

ముంబై: వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌కు టీమిండియాలో చోటు సంపాదించాలనుకున్న ముంబై బ్యాటర్‌‌‌‌‌‌‌‌ సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయంతో అతను దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యాడు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. 

‘సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. బుచ్చి బాబు టోర్నీలో హర్యానాపై సెంచరీ చేసే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఈ గాయమైంది. ప్రస్తుతం అతను సీవోఈలో రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. రాబోయే రోజుల్లో అతని పరిస్థితిని అంచనా వేస్తాం’ అని సీవోఈ వర్గాలు వెల్లడించాయి. వెస్ట్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌లో రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న బరోడా బ్యాటర్‌‌‌‌‌‌‌‌ శివాలిక్‌‌‌‌‌‌‌‌ శర్మ.. సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను భర్తీ చేయనున్నాడు. ఇక సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఉన్న వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ ధ్రువ్‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌ కూడా గజ్జల్లో గాయంతో దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ సెమీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నుంచి వైదొలిగాడు. ఉపేంద్ర యాదవ్‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి తీసుకోనున్నారు. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఆడనున్న చైనామన్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ స్థానంలో యష్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనున్నారు.