FIH ప్రో లీగ్‌‌‌‌లో ఇండియాకు మరో పరాజయం

FIH ప్రో లీగ్‌‌‌‌లో ఇండియాకు మరో పరాజయం

రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌‌‌‌లో ఇండియా మెన్స్ హాకీ టీమ్‌‌‌‌ నిరాశపరుస్తోంది. శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఆతిథ్య జట్టు 2–4 తేడాతో బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. సొంతగడ్డపై ఇండియా టీమ్‌‌‌‌కు వరుసగా ఇది మూడో ఓటమి. బెల్జియం తరపున అలెగ్జాండర్ హెండ్రిక్స్ (14వ, 17వ నిమిషం) రెండు గోల్స్‌‌‌‌తో చెలరేగగా, హ్యూగో లాబౌచర్ (11వ), ఆర్థర్ డి స్లోవర్ (15వ) తలో గోల్ సాధించారు. 24వ నిమిషంలో ఆదిత్య లాలాజ్ రీబౌండ్ ద్వారా ఇండియాకు తొలి గోల్ అందించగా 37వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌‌‌‌ను గోల్‌‌‌‌ చేశాడు.