ప్రయాణికులకు షాక్.. భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

ప్రయాణికులకు షాక్.. భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

వేసవి సెలవుల్లో  విదేశాలకు వెళ్లే  విమాన ప్రయాణికులు బిగ్ షాక్.. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలను అమాంతం పెంచేశాయి  విమాన యాన సంస్థలు. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమాన ఛార్జీలు 40నుంచి 50శాతం పెరిగాయి. దీంతో మే, జూన్‌లలో వేసవి సెలవులలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టికెట్ ఛార్జీల భారం పడనుంది. ముఖ్యంగా సిడ్నీ, సింగపూర్, లేహ్ ,శ్రీనగర్‌,వేసవిలో వియత్నాం ,థాయ్‌లాండ్ వంటి ప్రదేశాలకు వెళ్లే  ప్రయాణికులకు మరింత భారం కానుంది. పెరిగిన జెట్ ఇంధన ధరలు ,అందుబాటులో ఉన్న సీట్లు తగ్గడం వల్ల  విమాన టికెట్ల ధరలు పెరుగుదల ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.