ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టు కేసులు రావడం కలకలం రేపుతోంది.ఈ క్రమంలో యూరోప్ లోని పలు దేశాలు ఆ వ్యాక్సిన్ వాడకాన్ని ఆపేశాయి. ఇందులో భాగంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను యూరోపియన్ దేశాలు నిలిపివేసినట్టు సీఎన్ఎన్ యూఎస్ఏ ప్రసారం చేసిందని... ఇదే వ్యాక్సిన్ ను ఇండియాలో కోవిషీల్డ్ గా వాడుతున్నామని తెలిపారు. ఈ విషయంపై మన కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టి పెట్టిందా..లేదా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

