V6 News

పృథ్వీ షాకు మరో ఛాన్స్ ఇవ్వండి

పృథ్వీ షాకు మరో ఛాన్స్ ఇవ్వండి
పింక్ బాల్ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌‌లో టీమిండియా బ్యాట్స్‌‌మెన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. 36 రన్స్‌‌కే భారత్ చాప చుట్టేసింది. ఓపెనర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌‌ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో అతడ్ని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆసీస్ వెటరన్ లెఫ్టాండర్ మైకేల్ హస్సీ స్పందించాడు. షాకు మద్దతుగా నిలిచిన హస్సీ.. బాక్సిండ్ డే టెస్టులో అతడ్ని ఆడించాలని సూచించాడు. ‘పృథ్వీ షాపై సెలెక్టర్లు నమ్మకం ఉంచాలి. అవును, తొలి మ్యాచ్‌‌లో అతడు పరుగులు చేయలేదన్నది నిజమే. కానీ ఒక్క మ్యాచ్‌‌కే ఓ నిర్ణయానికి రావడం సరికాదు. క్వాలిటీ బౌలింగ్‌‌లో అలాంటి పిచ్‌‌పై బ్యాటింగ్ చేయడం కష్టమే. జో బర్న్స్‌‌నే తీసుకుంటే.. ఫస్ట్‌‌క్లాస్ క్రికెట్‌‌లో అతడి యావరేజ్ 7లోపే ఉంది. కానీ సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌‌లో బర్న్స్ విఫలమయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌‌లో 50 రన్స్ చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. పృథ్వీ షా విషయంలోనూ అతడి క్యారెక్టర్ ఏంటో గుర్తించాలి. అతడి మీద నమ్మకం ఉంచండి. మేం నిన్ను ఆడిస్తామని హామీ ఇవ్వాలి. మెల్‌‌బోర్న్ పిచ్ అతడికి నప్పుతుంది. ఆ పిచ్‌‌పై అంత బౌన్స్, స్పీడ్ ఉండదు’ అని హస్సీ పేర్కొన్నాడు.