India vs Brazil Football Match: ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు, అక్టోబర్ 3వ తేదీన కోల్‌కతాలో భారత జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుందంటూ బ్రెజిలియన్ మీడియాలో వచ్చిన వార్తలు ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. భారత గడ్డపై బ్రెజిల్ సీనియర్ జట్టు ఆడటం ఇదే తొలిసారి అవుతుందనే ప్రచారంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కానీ, ఈ వార్తల్లో నిజం ఎంత ఉందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కోల్‌కతాలో మ్యాచ్ నిజమే.. కానీ ప్రత్యర్థి భారత్ కాదు:
బ్రెజిల్ జట్టుతో తలపడే ప్రతిపాదన భారత్‌కు ఏనాడూ లేనేలేదు.. బ్రెజిలియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (CBF) సెప్టెంబర్-అక్టోబర్ ఫీఫా ఇంటర్నేషనల్ విండోలో కోల్‌కతాలో మ్యాచ్ ఆడటానికి చర్చలు జరుపుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, అక్కడ బ్రెజిల్‌తో తలపడేది ఇండియా కాదు.. మరొక దక్షిణ అమెరికా (సౌత్ అమెరికన్) దేశంతో బ్రెజిల్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 25, 29 తేదీల్లో ఆస్ట్రేలియాతో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనున్న బ్రెజిల్, తమ ఆసియా పర్యటనలో మూడో మ్యాచ్ కోసం కోల్‌కతా వేదికను పరిశీలిస్తోంది.
ALSO READ : సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత్?
ఫీఫా వరల్డ్ కప్ 2026లో నిరాశ.. నెయ్‌మార్ రిటైర్మెంట్:
అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా నిర్వహించిన ఫీఫా వరల్డ్ కప్ 2026లో బ్రెజిల్ తీవ్ర నిరాశపరిచింది. టోర్నీ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్, రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో నార్వే చేతిలో 2–1 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఘోర ఓటమి తర్వాత బ్రెజిల్ స్టార్ ఫార్వర్డ్ నెయ్‌మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. నెయ్‌మార్ వీడ్కోలు జట్టుకు పెద్ద దెబ్బే అయినప్పటికీ, జట్టులో ఉన్న యంగ్ ప్లేయర్స్ కి బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో అవకాశాలు దొరుకుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
