అజాజ్ పటేల్ రికార్డ్ పై అనిల్ కుంబ్లే రియాక్షన్

అజాజ్ పటేల్ రికార్డ్ పై అనిల్ కుంబ్లే  రియాక్షన్

ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి రికార్డ్ క్రియేట్ చేసిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లు. భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే అజాజ్ ప్రశంసించాడు. టెస్టులో మొదటి  రెండు రోజుల్లో  ఈ ఫీట్ సాధించాలంటే ఎంతో ఎఫర్ట్ అవసరం. వెల్ కమ్ టూ ద క్లబ్  అంటూ ట్వీట్ చేశాడు. వాంఖేడే స్టేడియంలో టీమిండియాను ఫస్ట్ ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌట్ చేశాడు అజాజ్ పటేల్. దీంతో టెస్టు క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన బౌలర్లలో మూడో ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఇండియా తరపున అనిల్  కుంబ్లే,  ఇంగ్లండ్ తరపున జిమ్ లేక‌ర్‌ ఈ ఘనత సాధించారు. వారి తర్వాత మూడో వ్యక్తిగా అజాజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు.