IND vs PAK: మళ్ళీ సెమీఫైనల్లో భారత్ vs పాకిస్తాన్?.. విశ్లేషకులు ఏమ్మన్నారంటే..! 

IND vs PAK: మళ్ళీ సెమీఫైనల్లో భారత్ vs పాకిస్తాన్?.. విశ్లేషకులు ఏమ్మన్నారంటే..! 

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 దశ ఈరోజు ప్రారంభం కానుంది. కొలంబోలో జరిగే న్యూజిలాండ్–పాకిస్థాన్ మ్యాచ్‌తో ఈ రౌండ్ మొదలవుతోంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, శ్రీలంక కూడా ఉన్నాయి. మరో గ్రూప్‌లో భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో మాజీ భారత క్రికెటర్లు తమ సెమీఫైనలిస్టులను అంచనా వేశారు. చతేశ్వర్ పుజారా, మహమ్మద్ కైఫ్, వరుణ్ ఆరోన్, సంజయ్ బంగార్, సబా కరీమ్‌తో పాటు ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకని యుజ్వేంద్ర చహల్ కూడా సెమీస్ కి వచ్చే జట్ల గురించి తెలిపాడు.  

* వరుణ్ ఆరోన్ తప్ప మిగతా అందరూ గ్రూప్–1 నుంచి భారత్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్‌కు చేరుతాయని చెప్పగా.. వరుణ్ ఆరోన్ మాత్రం దక్షిణాఫ్రికా స్థానంలో వెస్టిండీస్‌ను సెమీస్‌కు ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మరో ప్రత్యేకమై విషయాన్ని అతడు పంచుకున్నాడు. గ్రూప్–2 నుంచి పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుతుందని చెప్పిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. సంజయ్ బంగార్ కూడా పాక్‌కు సపోర్టు ప్రకటించడంతో, భారత్–పాకిస్థాన్ మళ్లీ సెమీఫైనల్లో తలపడొచ్చనే చర్చ కొనసాగుతుంది.  

ALSO READ : ఇదెక్కడి న్యాయం?.. ఆ విషయంలో భారత్‌కు ఒక రూల్.. మాకొక రూలా!

పాకిస్థాన్ తమ అన్ని సూపర్–8 మ్యాచ్‌లను కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. అక్కడి పిచ్‌లు నెమ్మదిగా, లో బౌన్స్‌తో ఉంటాయి. ఇది పాకిస్థాన్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని క్రికెట్ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మాన్ తారిక్ వంటి బౌలర్లు ప్రత్యర్థులకు పెను సవాలుగా మారవచ్చని చెబుతున్నారు. ఆస్ట్రేలియాను గ్రూప్ దశలోనే ఇంటికి పంపిన శ్రీలంక, జింబాబ్వే జట్లకు మాత్రం నిపుణుల నుంచి పెద్దగా మద్దతు దొరకలేదు. పుజారా, సంజయ్ బంగార్ మాత్రమే శ్రీలంక సెమీస్‌కు చేరుతుందని అంచనా వేశారు. జింబాబ్వేను మాత్రం ఎవ్వరూ సెమీస్ కి వెళ్లే జట్టుగా ఎంపిక చేయలేదు. తమ గ్రూప్‌లో టాప్ గా నిలిచిన సికందర్ రాజా సారథ్యంలోని జట్టు మరోసారి తమ సత్తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది.


సెమీఫైనల్ కి టీమ్స్ అంచనాలు:

* యుజ్వేంద్ర చహల్: భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్

* చతేశ్వర్ పుజారా: భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్

* మహమ్మద్ కైఫ్: భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్

* వరుణ్ ఆరోన్: భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్థాన్

* సంజయ్ బంగార్: భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్

* సబా కరీమ్: భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక