T20 World Cup: మళ్లీ సెమీఫైనల్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్?

T20 World Cup: మళ్లీ సెమీఫైనల్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో టోర్నమెంట్ లో భారత్,  పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రత్యేకమైన బజ్ ఉంటుంది. ఏ ఐసీసీ టోర్నీలో అయినా సరే..  ఇండియా,  పాక్ మ్యాచ్ అంటే మరో తీవ్రమైన ఉత్కంఠ ఉంటుంది. ఈ మ్యాచులకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రపంచ కప్2026 టోర్నీలో లీగ్ దశలో దాయాది దేశలు తలపడ్డాయి. టీమిండియా పా క్ ని చిత్తుగా ఓడించి.. సూపర్-8లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌ను క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇదే టోర్నమెంట్లో మరోసారి భారత్ , పాకిస్తాన్ తలపడాలని అభిమానులు మళ్లీ కోరుకుంటున్నారు.  

ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు జింబాబ్వేపై 72 పరుగుల భారీ గెలిచి, సెమీఫైనల్ రేసులో నిలిచింది. ఈ ఒక్క గెలుపుతో నెట్ రన్‌రేట్ -0.100కి చేరుకుంది. రేపు (మార్చి 1న) జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా జట్టు గెలిస్తే గ్రూప్-–1లో 4 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలుస్తుంది. అప్పుడు గ్రూప్–-2 టాపర్‌తో సెమీస్ ఆడాల్సి ఉంటుంది. గ్రూప్-2లో శ్రీలంకపై పాక్ గెలిచినా.. అది సెకండ్ ప్లేస్ కే పరిమితం అవుతుంది. కాబట్టి, భారత్ గ్రూప్-–1 టాపర్ కాకపోతే ఇండియా– -పాక్ మధ్య సెమీఫైనల్ జరిగే అవకాశం లేదు.. కాబట్టి, భారత్ గ్రూప్-1లో మొదటి స్థానం దక్కించుకుంటేనే ఈ క్లాసిక్ పోరును మరోసారి చూసే ఛాన్స్ ఉంటుంది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లలో గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది.  జింబాబ్వేతో మరో మ్యాచ్ ఇంకా మిగిలి ఉంది. రేపు (మార్చి 1న) మధ్యాహ్నం జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించాలి.. అలానే భారత్– వెస్టిండీస్‌ను భారీ తేడాతో ఓడించి, సౌతాఫ్రికా కంటే మెరుగైన నెట్ రన్‌రేట్ సాధించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్, ప్రోటీస్ జట్లు చెరో 4 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. మెరుగైన నెట్ రన్‌రేట్‌తో టీమిండియా గ్రూప్ టాపర్ గా నిలుస్తుంది. ఈ క్రమంలో ఇండియా–  పాక్ సెమీస్‌లో తలపడే ఛాన్స్ ఉంది. మొత్తంగా సెమీస్‌లో భారత్, పాక్ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా ఉంది. ఒక వేళ టీమిండియా, పాకిస్థాన్ సెమీ ఫైనల్‌లో తలపడితే, ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో జరుగుతుంది. ఒకవేళ పాక్ కాకుండా ఇతర జట్టుతో తలపడితే, ఆ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.

గ్రూప్ 1 పాయింట్ల పట్టిక:
* దక్షిణాఫ్రికా: 4 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, NRR +2.890
* వెస్టిండీస్: 2 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, NRR +1.791
* భారత్: 2 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, NRR -0.100
* జింబాబ్వే: 0 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, NRR -4.475

గ్రూప్ 2 పాయింట్ల పట్టిక:
*  ఇంగ్లాండ్: 6 పాయింట్లు, 3 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ +1.096
* న్యూజిలాండ్: 3 పాయింట్లు, 3 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్+1.390
* పాకిస్థాన్: 1 పాయింట్, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ -0.461
* శ్రీలంక : 0 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ -2.800

రేపే సూపర్ 8 మిగిలిన మ్యాచ్‌లు: 
* మార్చి 1: దక్షిణాఫ్రికా vs జింబాబ్వే (మధ్యాహ్నం 3 గంటలకు)
* మార్చి 1: ఇండియా vs వెస్టిండీస్ (సాయంత్రం 7 గంటలకు)