- రా. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్
డర్బన్: విమెన్స్ వన్డే వరల్డ్ చాంపియన్ టీమిండియా ఇప్పుడు టీ20 కప్పు కోసం సన్నాహకాలు మొదలు పెడుతోంది. జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ ముంగిట సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు రెడీ అయింది. ఇరు జట్ల మధ్య డర్బన్‌లో శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇండియా, సౌతాఫ్రికా తొలిసారి మళ్లీ గ్రౌండ్‌లో ఢీకొనబోతుండటం విశేషం. హర్మన్ కెప్టెన్సీలోని ఇండియా ఈ పో రులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని చూస్తోంది.
హర్మన్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమాతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. రేణుక సింగ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ బౌలింగ్ బాధ్యతలు చూసుకోనున్నారు. మరోవైపు గత నెలలో న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లో ఓడిపోయిన లారా వోల్‌వర్ట్ కెప్టెన్సీలోని సఫారీ టీమ్ అక్కడ చేసిన తప్పిదాలను సరి చేసుకొని ఇండియాపై సత్తా చాటాలని చూస్తోంది.

