టీ మిండియా మరో సిరీస్‌పై కన్నే సింది. తొలి టీ–20లో చిన్న టార్గెట్ ఛేదించేం దుకు కష్టపడ్డ రోహిత్ సేన మంగళవారం ఇక్కడి ఎకానా ఇంటర్నే షనల్ స్టేడియంలోవెస్టిం డీస్‌తో జరిగే రెం డో మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. టీ20 ప్ర-
పంచకప్ నకు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ లో టీమిం డియాకు సాను కూల ఫలితాలు లభించాయి. ము ఖ్యం గా లెఫ్టార్మ్ సీమర్ లోటును ఖలీ ల్ అహ్మద్ చక్కగా తీరుస్తు న్నాడు. ఇప్పటి కేవన్డేల్లో ఆకట్టు కున్న ఖలీల్ అరంగేట్రం టీ20లోనూ రాణించి జట్టు లో భరోసా నింపా డు. అదే విధంగా తమ్ము డు హార్దిక్ పాండ్యా గైర్హా జరీ లో టీ20 చాన్స్ కొట్టేసి న క్రునా ల్ పాండ్యా వచ్చి చాన్స్‌ను ఒడిసిపట్టు కున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు కీలక సమయంలో బ్యా ట్ ఝుళింపించి ఆల్ రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు. ఇక ఈడెన్ లో చైనామన్ స్పి న్నర్ కుల్దీప్ యాదవ్ గురిం చి ఎంత చెప్పుకున్నా తక్కువే. వన్డేలలో అద్భు తంగా రాణించిన తను టీ-20ల్లోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తు న్నాడు. అతడి నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శననే కోరుకుంటోం ది.పేసర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఆకట్టు కుంటు న్నాడు. గత మ్యాచ్ లో అనారోగ్యం తో జట్టు కు దూరమైన భు వనేశ్వర్ లక్నోలో బరిలోకి దిగనున్నాడు. తొలి టీ20లో ధారాళంగా పరుగులిచ్చుకున్న ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోను న్నాడు. అయితే, బౌలింగ్ ఎంతో గొప్పగా ఉన్నా కూడా ఈడెన్ గార్డెన్స్‌లో మన బ్యాటిం గ్ విభాగం చేతులెత్తేయడం మేనేజ్‌మెం ట్ ను కలవరపెడుతోం ది. రెగ్యు లర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హా జరీ లో రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్ గా జట్టు కు శుభారంభం ఇవ్వలేకపోయాడు.
అతడితో పాటు ధవన్ , లోకేశ్ రాహుల్ , రిషభ్ పంత్ , మనీశ్ పాం డే పె ద్దగా ఆకట్టు కోలేకపోయారు. దినేశ్ కార్తీక్, క్రునాల్ ఆదుకోకపోతే పరిస్థితి వేరుగా ఉండేది. ము ఖ్యం గా వరుసగా విఫల మవుతున్న ధవన్ గాడిన పడాల్సి న అవసరం ఉంది.అలాగే, ధోనీ వారసుడిగా భావిస్తున్న పంత్ స్పె షలిస్ట్ బ్యాట్స్‌మన్ గా వచ్చి తీవ్రంగా నిరాశ పరిచాడు. తన
ఎంపికకు ఈ మ్యాచ్ లో అయినా అతడు న్యాయం చేయాల్సి ఉంటుం ది. పే లవ షా ట్ ఆడి వికెట్ పా రేసుకున్న కేఎల్ రాహుల్ ను ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో తిట్టిపోస్తు న్నారు. తన సా మర్థ్యంపై వస్తు న్న విమర్శలకు రాహుల్ బ్యా ట్ తో సమాధానం చెపాల్సి న సమయం వచ్చిం ది. మిడిలార్డర్ లో చోటు ఆశిస్తో న్న మనీశ్ పాం డే కూడా తన విలువను చాటిచెప్పే ఇన్నింగ్స్ ఆడాల్సి న ఆవశ్యకత ఉంది. నిదాహస్ ట్రోఫీ ఫైనల్ మా దిరిగా ఈడెన్ లో జట్టు ను గట్టెక్కిం చిన కార్తీక్‌పై మేనేజ్‌మెం ట్ భరోసా ఉంచిం ది.
విండీస్ రాతమారేనా ..ఈ ఫార్మా ట్ లో మనపై మంచి రికార్డు ఉన్నా పే లవ బ్యాటిం గ్ తో కోల్ కతాలో ఓడిన విం డీస్ సిరీస్‌లో 1తో వెనుకంజలో నిలిచిం ది. ఈ మ్యాచ్ ఆ జట్టు కు చావోరేవో లాంటిం ది. ఇప్పటికే టె స్ట్, వన్డేల్లో చిత్తయిన కరీబియన్ టీమ్ మరో సిరీస్‌ను కోల్పో కూడదంటే ఈ మ్యాచ్ లో నెగ్గి తీరాల్సిందే . దాం తో, ఒత్తిడంతా ఆ జట్టు పైనే ఉండనుంది. కీ రన్ పొలార్డ్, కార్లో స్ బ్రాత్ వైట్ , డారె న్ బ్రావోలాంటి స్టార్లు చేరినావిం డీస్ ప్రదర్శనలో తేడా ఏం లేదు.
టీ20 వరల్డ్ చాంపి యన్ అయిన విం డీస్ ఈడెన్ లో స్థాయికి తగ్గట్టు ఆడలేదు. షై హోప్ , హెట్ మయర్ లు విఫలం కావడం జట్టు ను ఆందోళన పరుస్తోం ది. మరీ ము ఖ్యం గా వికెట్ల మధ్య సమన్వయ లోపంతో పే లవ రీ తిలో రనౌట్ కావడాన్నివిం డీస్ ఫ్యాన్స్ జీర్ణించు కోలేకపోతున్నారు. ఆండ్రీ రస్సెల్ దూరమవడం వారికి చేటు చేసింది. అయితే, హార్డ్ హిట్టర్లు న్న ఆ జట్టు బ్యాటిం గ్ లో తేలి పోయినా బౌలింగ్ లో కాస్త రాణించిం ది. యువ పే సర్ ఒషానె థామస్‌తో పాటు కెప్టెన్ బ్రాత్ వైట్ బంతితో అదరగొట్టాడు. అయితే, కెప్టెన్ బ్యాటిం గ్ లో కూడా జట్టు ను ముందుం డి నడిపించాల్సి ఉంటుం ది. ఈడెన్ లో విఫలమైన పొలార్డ్, అలెన్ తో పాటు రామ్‌దిన్ , పా వెల్ బ్యా ట్ తో సత్తా చాటి సమష్టిగా ఆడితేనేవిం డీస్ సిరీస్ రేసులో నిలవగలదు. పొట్టి ఫార్మాట్ లో నాలుగేళ్ల తర్వాత వెస్టిం డీస్ పై తొలి విజయాన్ని కోల్ కతాలో సాధించిన టీమిండియా అదే జోరును కొనసాగిం చాలని భావిస్తోం ది. ! ఈడెన్ గార్డెన్స్‌లో అద్భు తమైన బౌలిం గ్ , ఫీల్డింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేసిన రోహిత్ సేన నేడు జరిగే రెం డో పోరులో బ్యాటిం గ్ లోనూ మెప్పించి మరో మ్యాచ్ మిగిలుం డగానే సిరీస్ ను ఖాతాలో వేసుకునేం దుకు రంగం సిద్ధం చేసుకుం ది..! మరోవైపు ఫార్మాట్
మారినా రాత మార్చుకోలేకపోతున్న కరీబియన్ టీమ్ చావోరేవో తేల్చుకునేం దుకు సిద్ధమైం ది..! మరో సిరీస్ పై టీమిండియా గురి విం డీస్ తో రెండో టీ20 నేడు ఉత్సాహంలో రోహిత్ సేన ఒత్తిడిలో కరీబియన్ టీమ్ ఇండియా: రోహిత్ (కెప్టెన్ ), ధవన్ , రాహుల్ ,
మనీశ్ , పంత్ , కార్తీక్ (కీపర్ ), క్రునాల్ , కుల్దీప్ , బుమ్రా, భు వనేశ్వర్ , ఖలీల్ . వెస్టిం డీస్ : హోప్ , రామ్‌దిన్ (కీ పర్ ), హెట్ మయర్ , పొలార్డ్, డారె న్ బ్రావో, రోవ్ మన్ , బ్రాత్ వైట్ (కెప్టెన్ ), అలెన్ , పా ల్ , పైయర్ .పిచ్ , వాతావరణం ఎకానా పి చ్ స్పి న్నర్లకు అనుకూలిస్తుం దని,తక్కు వ స్కోర్లు నమోదవవచ్చని క్యూ రేటర్ చెబుతున్నాడు. ఇక్కడ 130 పరుగులు
ఛేదిం చడం కూడా కష్టమేనని అంటున్నాడు. స్లో బౌన్స్‌తో కూడి ఉన్నం దున భారీషా ట్లకు మైదానం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. మంగళవారం లక్నోలో వాతావరణం పొడిగా ఉంటుం ది. శీతాకాలం కాబట్టి మంచు ప్రభావం ఉంటుం ది. మ్యాచ్ కు వర్షసూ చనలేదు.
