టీమిండియా థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ

టీమిండియా థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ

ముంబై: కొత్త ఏడాదిని టీమిండియా థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌ విక్టరీతో షురూ చేసింది. శ్రీలంకతో ఆఖరి బాల్​ వరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో సూపర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంది. లాస్ట్​ ఓవర్​లో 13 రన్స్​ను కాపాడుకుని లంకేయులకు చెక్​ పెట్టింది. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్​లో టీమిండియా 2 రన్స్​ తేడాతో గెలిచి మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1–0 లీడ్​లో నిలిచింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 162/5 స్కోరు చేసింది. దీపక్​ హుడా (23 బాల్స్​లో 1 ఫోర్​, 4 సిక్సర్లతో 41 నాటౌట్​), ఇషాన్​ కిషన్​ (29 బాల్స్​లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37), అక్షర్​ పటేల్​ (20 బాల్స్​లో 3 ఫోర్లు, 1 సిక్స్​తో 31 నాటౌట్​) రాణించారు. తర్వాత లంక 20 ఓవర్లలో 160 రన్స్​కు ఆలౌటైంది.  కెప్టెన్​ దసున్​ షనక (27 బాల్స్​లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45) టాప్​ స్కోరర్​. శివం​ మావి 4 వికెట్లు తీశాడు. హుడాకు ‘ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్​తో మావి, శుభ్​మన్​ గిల్​ టీ20 డెబ్యూ చేశారు.​ ఇరుజట్ల మధ్య గురువారం పుణెలో రెండో టీ20 జరగనుంది. 

హుడా జోరు..

ముందుగా బ్యాటింగ్​కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్​లో 6, 4తో ఇషాన్​ జోరు చూపెట్టగా, రెండో ఓవర్​లో ఫోర్ కొట్టిన​ శుభ్​మన్​ గిల్​ (7).. తర్వాతి ఓవర్​లో ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్​కు 27 రన్స్​ పార్ట్​నర్​షిప్​ బ్రేక్​ అయ్యింది. నాలుగో​ ఓవర్​లో ఫోర్​తో టచ్​లోకి వచ్చిన సూర్యకుమార్​ (7).. ఆరో ఓవర్​లో వెనుదిరిగాడు. ఆ వెంటనే సంజూ శాంసన్​ (5) చెత్త షాట్​తో వికెట్​ ఇచ్చుకోవడంతో ఇండియా  46/3తో కష్టాల్లో పడ్డది.  ఈ దశలో కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా (29) నిలకడగా ఆడాడు. 8వ ఓవర్​లో వరుస ఫోర్లు కొట్టి  ఇన్నింగ్స్​కు మళ్లీ ఊపు తెచ్చాడు.  ఆపై, ఇషాన్​  6, 4 బాదడంతో సగం ఓవర్లకి ఇండియా స్కోరు 75/3కి చేరింది. కానీ 11వ ఓవర్​లో హసరంగ.. ఇషాన్​ను ఔట్​ చేయడంతో నాలుగో వికెట్​కు -31 రన్స్​ పార్ట్​నర్​షిప్​ ముగిసింది. ఈ దశలో దీపక్​ హుడా మెరుగ్గా ఆడాడు. కానీ, 15వ ఓవర్​లో పాండ్యా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన అక్షర్​ పటేల్​, హుడాతో పోటీపడ్డాడు. 16వ ఓవర్​లో దీపక్​ రెండు వరుస సిక్సర్లు, తర్వాతి ఓవర్​లో మరో సిక్సర్​తో జోరు పెంచాడు. ఆ వెంటనే అక్షర్​ కూడా 4, 6, 4తో చెలరేగాడు. లాస్ట్​ ఓవర్​లో హుడా 6 , 4 కొట్టాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్​కు 35 బాల్స్​లోనే 68 రన్స్​ జోడించడంతో ఇండియా మంచి టార్గెట్​ నిర్దేశించింది. లంక బౌలర్లలో మధుషనక, తీక్షణ​, చమిక కరుణరత్నే, ధనంజయ​ డిసిల్వా, వానిందు హసరంగ తలోవికెట్​ తీశారు. 

మావి అదుర్స్​..

ఛేజింగ్​లో లంక ఆరంభంలోనే తడబడింది. తన తొలి పోరులోనే యంగ్​ పేసర్​ శివం​ మావి మంచి లైన్​ అండ్​ లెంగ్త్​తో లంకేయులను దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో నిశాంక (1), ధనంజయ్​ డిసిల్వా (8)ను ఔట్​ చేసి ఝలక్​ ఇచ్చాడు.  ఓ ఎండ్​లో కుశాల్​ మెండిస్​ (28) పోరాడినా.. రెండో ఎండ్​లో అసలంక (12), రాజపక్స (10) ఫెయిలవడంతో లంక  68 రన్స్​కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్​ షనక, హసరంగ (21) అనూహ్యంగా చెలరేగారు.  చహల్​ బౌలింగ్​లో రెండు సిక్సర్లు కొట్టిన హసరంగ.. ఆరో వికెట్​కు 40 రన్స్​ జోడించి మావి (15వ ఓవర్) బౌలింగ్​​లో ఔటయ్యాడు. లంకకు  30 బాల్స్​లో 53 రన్స్​ అవసరమైన టైమ్​లో  షనక భారీ షాట్లు కొట్టాడు.  కానీ,17వ ఓవర్లో  ఉమ్రాన్ ​ అతడిని ఔట్​ చేసి మ్యాచ్​ను  మలుపు తిప్పాడు. ఆవెంటనే   మహీశ్​ తీక్షణ (1)ను మావి ఔట్​ చేశాడు. కానీ, 19వ ఓవర్లో హర్షల్​ 16 రన్స్​ లీక్​ చేశాడు.  లాస్ట్​ ఓవర్లో లంకకు 13 రన్స్​ అవసరం అవగా.. పాండ్యా అనూహ్యంగా స్పిన్నర్​ అక్షర్​తో బౌలింగ్​ చేయించాడు. మూడో బాల్​కు  కరుణరత్నే (23 నాటౌట్​) సిక్స్​ కొట్టి టెన్షన్​ రేపాడు. చివరి రెండు బాల్స్​కు కాసున్​ రజిత (5),  మధుషనక (0) రనౌట్​ కావడంతో లంకకు ఓటమి తప్పలేదు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 162/5 (దీపక్​ హుడా 41*, ఇషాన్​ 37, అక్షర్​ 31*, ధనంజయ​ డిసిల్వా 1/6), 
శ్రీలంక: 20 ఓవర్లలో 160 ఆలౌట్​ ( షనక 45, కుశాల్​ మెండిస్​ 28, శివం​ మావి 4/22).