ప్రపంచ వేదికపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలమేంటో ప్రదర్శించే ఈవెంట్ లో ఇండియాకు చెందిన తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదానికి గురికావడం ఆందోళనకు గురిచేసింది. తేజస్ యుద్ధ విమానం దుబాయ్ ఎయిర్ షో 2025లో విన్యాసాలు ప్రదర్శిస్తున్న క్రమంలో ప్రమాద వశాత్తు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైటర్ జెట్ పైలట్ అక్కడిక్కడే మృతి చెందాడు.పైలట్ చనిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.
లోకల్ టైమ్ మధ్యాహ్నం 2.10 గంటలకు ఓయిర్ పోర్ట్ లో విమాన్ టేకాఫ్ అయ్యింది. ప్రదర్శనలో భాగంగా గింగిరాలు తిరుగుతూ ప్రదర్శనకు వచ్చిన అందరినీ ఆకర్శిస్తూ గాల్లోకి దూసుకెళ్లింది. కొంత దూరం వెళ్లాక ఫ్లైట్ నుంచి ఎజెక్షన్ ఆగిపోయింది. అంటే వెనకభాగం నుంచి వచ్చే పొగ ఆగిపోయింది. ఈ ఎజెక్షన్ కారణంగానే ఫ్లైట్ ముందుకు వెళ్తుంటుంది. ఎప్పుడైతే ఎజెక్షన్ ఆగిపోయిందో.. వెంటనే జెట్ స్పీడ్ కూడా తగ్గిపోయి అమాంతం అలాగే నేలపై పడిపోయింది. పైలట్ అదుపు చేయడానికి ప్రయత్నించినా.. టెక్నికల్ సమస్యతో ఎజెక్షన్ స్టార్ట్ కాలేదు. దీంతో జెట్ పడిపోయింది. పైలట్ మంటల్లోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన దురదృష్టకరమని, పైలట్ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.
భారత్ కు చెందిన ప్రతిష్టాత్మక యుద్ధ విమానం తేజస్ ఫైటర్ జెట్ శుక్రవారం (నవంబర్ 21) క్రాష్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోలు వైరల్ గా మారాయి. మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో ఎయిర్ షో ఈవెంట్లో ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఫైటర్ జెట్ తేజస్ కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. అయితే ఈ ఘటనలో పైలట్ చనిపోవడం విషాదకరంగా మిగిలింది. ఎయిర్ షోలో తేజస్ జెట్ అదుపుతప్పి ప్రమాద వశాత్తు కిందపడిపోయింది. దీంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరగటంతో వెంటనే షోని ఆపేశారు అధికారులు. సహాయక చర్యలు చేపట్టారు.
దుబాయ్ ఎయిర్ షో - 25 ఈవెంట్ కు హాజరైన ప్రేక్షకులకు సమీపంలోనే జెట్ కూలటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్దగా పేలుడు శబ్దంతో భారీ ఎత్తున పొగలు వెలువడ్డాయి. వెంటనే ఫైర్ సిబ్బంది, రక్షక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఏంటి తేజస్ జెట్ ప్రత్యేకత:
తేజస్ యుద్ధ విమానం ఇండియాకు ప్రతిష్టాత్మకమైనది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేయగా.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది. ఇది ఇండియాతో తయారు చేసిన తొలి ఫైటర్ జెట్ కావడం గమనార్హం.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో Mk1 రకానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ ను వాడుతున్నారు. త్వరలోనే Mk1A వేరియెంట్ ను డెలివరీ చేసేందుకు HAL ఇప్పటికే సిద్ధమైంది.
దుబాయి లో ఏ1 మక్తూమ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు ఆధ్వర్యంలో (Al Maktoum International Airport in Dubai World Central) ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ షోలో ప్రమాదం జరగటం ఆందోళనకరంగా మారింది.
