IND vs AUS: ఆస్ట్రేలియా- ఇండియా వైట్ బాల్ సిరీస్.. 50 రోజుల ముందే ఫ్యాన్ జోన్ టిక్కెట్లు సోల్డ్ ఔట్

IND vs AUS: ఆస్ట్రేలియా- ఇండియా వైట్ బాల్ సిరీస్.. 50 రోజుల ముందే  ఫ్యాన్ జోన్ టిక్కెట్లు సోల్డ్ ఔట్

ఆసియా కప్ తర్వాత టీమిండియా తమ తదుపరి వన్డే, టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఈ మెగా సిరీస్ ప్రారంభమవుతుంది. భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించడానికి ఇంకా 50 రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ సిరీస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. టికెట్ల విషయంలో అప్పుడే దూకుడు మొదలైంది. ప్రత్యేక ఫ్యాన్ జోన్ల టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని క్రికెట్ ఆస్ట్రేలియా కన్ఫర్మ్ చేసింది. 

"ఎనిమిది వేదికలలోని భారత అభిమానుల జోన్లకు భారీ స్పందన రావడంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ సిరీస్ చుట్టూ ఊపు పెరగడం, మ్యాచ్ పట్ల ఫ్యాన్స్ ఆసక్తి చూపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. స్టాండ్స్‌లో ఉత్సాహభరితమైన వాతావరణం, రెండు గొప్ప క్రికెట్ దేశాల మధ్య స్టేడియంలో జరగబోయే ప్రపంచ స్థాయి పోటీ కోసం మేము ఎదురు చూస్తున్నాము" అని మోరిసన్ క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఎనిమిది మ్యాచ్‌లకు 90,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. సిడ్నీలో జరగబోయే మూడో వన్డేతో పాటు కాన్‌బెర్రాలో జరిగే తొలి టీ20కి టికెట్స్ పూర్తిగా అమ్ముడయ్యాయానని గతంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. మెల్ బోర్న్, గబ్బాల్లో జరగబోయే టీ20 మ్యాచ్ కు సైతం ఎక్కువగా టికెట్స్ అమ్ముడు పోయాయయని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

 2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది.

అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. కోహ్లీ, రోహిత్ లను ఇకపై ఆస్ట్రేలియాలో చూడబోతున్నాం. 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు వీరిద్దరూ ఆడి తమ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది.