మొబైల్లో ఆ వీడియోలు ఉన్నాయని అరెస్ట్

మొబైల్లో ఆ వీడియోలు ఉన్నాయని అరెస్ట్

మెల్‌ బోర్న్‌ : పోర్న్ వీడియోలు మొబైల్లో ఉన్నందుకు ఓ ఇండియన్ కు ఆస్ట్రేలియాలో ఊహించని పరిణామం ఎదురైంది.  ఫోన్‌ లో అశ్లీల ఫొటోలు, పోర్న్ వీడియోలు ఉన్నాయని ఇండియాకు చెందిన ఓ వ్యక్తికి జైలుశిక్ష వేశారు మెల్‌బోర్న్‌ పోలీసులు. ఇండియాకు చెందిన మన్‌ ప్రీత్‌ సింగ్‌ ఫోన్‌ లో చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు ఉన్నాయని.. ఇది చట్టరిత్యా నేరమని అతడిని కష్టడీలోకి తీసుకున్నారు. అయితే ఇది నేరమని తనకు తెలియదని కోర్డు ముందు విన్నవించుకున్నాడు.

అతని వాదన విన్న కోర్టు.. ఇంతకు ముందు అతనిపై ఎలాంటి కేసులు లేనందున ఏడు నెలల జైలు శిక్షను, ఐదు వందల డాలర్లను ఫైన్‌ గా వేసింది. దీంట్లో రెండు నెలలు మాత్రమే జైలు శిక్ష అని, మంచి ప్రవర్తనతో మెలిగితే.. ఆ తర్వాత వెయ్యి డాలర్ల పూచీ కత్తుతో బయటకు రావచ్చని తెలిపింది. ఆ ఐదు నెలలు కోర్టు పరిధిలోనే ఉండాలని..ఆ తర్వాతే ఇండియాకు పంపుతామని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో అతడిని పలువురు కామెంట్లు చేస్తూ.. దేశం పరువు తీశావు అంటూ ట్వీట్స్ చేస్తుండగా..మరి కొందరు అశ్లీల వీడియోలు తీసేదే ఎక్కువగా ఆస్ట్రేలియాలో కదా అంటున్నారు.