V6 News

ఐటీటీఎఫ్‌‌ ప్రపంచ టీమ్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ చాంపియన్‌‌షిప్‌.. గ్వాటెమాలకు చెక్

ఐటీటీఎఫ్‌‌ ప్రపంచ టీమ్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ చాంపియన్‌‌షిప్‌.. గ్వాటెమాలకు చెక్

లండన్‌‌: ఐటీటీఎఫ్‌‌ ప్రపంచ టీమ్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా మెన్స్‌‌ టీమ్‌‌ కీలక విజయం సాధించింది. గ్రూప్‌‌–7లో భాగంగా గురువారం జరిగిన ఏకపక్ష పోరులో ఇండియా 3–0తో గ్వాటెమాలపై గెలిచింది. తొలి సింగిల్స్‌‌లో జ్ఞానశేఖర్‌‌ సత్యన్‌‌ 3–0తో సెర్గియో కారిల్లోపై, మానవ్‌‌ ఠక్కర్‌‌ 3–0తో ఇయాన్‌‌ మెరెల్స్‌‌పై, జైన్‌‌ పయాస్‌‌ 3–0తో రికార్డో గాటికాపై గెలిచారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా 3–2తో స్లోవేకియాను ఓడించింది. ఈ విజయంతో ఇండియా గ్రూప్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌కు చేరుకుంది.

తొలి మ్యాచ్‌‌లో మానుష్‌‌ షా 2–3తో లుబోమిర్‌‌ పిస్టెజ్‌‌ చేతిలో ఓడగా, రెండో మ్యాచ్‌‌లో మానవ్‌‌ ఠక్కర్‌‌ 3–0తో జాకుబ్‌‌ జెలింకాపై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. మూడో సింగిల్స్‌‌లో వాంగ్‌‌ యాంగ్‌‌ 3–2తో హర్మీత్‌‌ దేశాయ్‌‌పై నెగ్గి మళ్లీ స్లోవేకియాను 2–1 ఆధిక్యంలో నిలిపాడు.

కీలకమైన రివర్స్‌‌ సింగిల్స్‌‌లో మానవ్‌‌ ఠక్కర్‌‌ 3–0తో లుబోమిర్‌‌ పిస్టెజ్‌‌పై, మానుష్‌‌ షా 3–0తో జాకుబ్‌‌ జెలింకాపై గెలిచి ఇండియాకు విజయాన్ని అందించారు. విమెన్స్‌‌ గ్రూప్‌‌–6 మ్యాచ్‌‌లో ఇండియా 3–0తో రువాండాపై నెగ్గింది. మనికా బాత్రా 3–0తో హిర్వా చాంటల్‌‌పై, దియా చిటాలె 3–0తో ఎల్విని తుమ్‌‌కుండేపై, సిండ్రెలా డాస్‌‌ 3–0తో మబాజీపై గెలిచారు.