మోడీజీ పాక్ పై ఎటాక్ చేయండి: జాతీయ జెండాలతో ముస్లింల భారీ ర్యాలీ

మోడీజీ పాక్ పై ఎటాక్ చేయండి: జాతీయ జెండాలతో ముస్లింల భారీ ర్యాలీ

పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా ఢిల్లీలో ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేశారు. శుక్రవారం రోజున మసీదులో ప్రత్యేక ప్రార్థనల తర్వాత ఢిల్లీ వీధుల్లో జాతీయ జెండా ప్రదర్శిస్తూ ర్యాలీ తీశారు. పాకిస్థాన్ ముర్దాబాద్ … హిందూస్థాన్ జిందాబాద్… భారత్ మాతాకీ జై అనే నినాదాలతో నగరాన్ని హోరెత్తించారు.

ఢిల్లీలోని నారెలా నియోజకవర్గం.. భక్త్ వాపూర్ గ్రామంలో.. వేలాది మంది ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. గ్రామం నుంచి.. సుభాష్ చౌక్ వరకు.. జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తూ కదిలారు. చంటిపిల్లలను ఎత్తుకుని కూడా కొందరు ముస్లింలు ర్యాలీలో పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు క్యాండిల్ లైట్లతో నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు.

మోడీజీ అటాక్ కరో… హమ్ తుమ్హారే సాథ్ హై : ముస్లింలు

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఎగదోస్తోందని … టెర్రరిజాన్ని కేంద్రం అంతం చేయాలని ముస్లింలు నినదించారు. జవాన్లపై జరిగిన దాడితో దేశం మొత్తం బాధలో ఉందని అన్నారు. ప్రధానమంత్రి మోడీ తీసుకునే నిర్ణయానికి మద్దతుగా నిలుస్తామని గట్టిగా నినాదాలు చేశారు. ఈ విషయంలో మోడీతో కలిసి నడుస్తాం… పాక్ దెబ్బకు మోడీ బదులిస్తారు… అంటూ మద్దతు పలికారు. “మోడీజీ అటాక్ కరో… హమ్ తుమ్హారే సాథ్ హై” అనే నినాదాలతో హోరెత్తించారు. కేంద్రప్రభుత్వం గనుక ఉగ్రదాడికి దీటైన బదులు ఇవ్వకపోతే… ముస్లిం ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి పాకిస్థాన్ కు దీటైన జవాబు ఇస్తామని హెచ్చరించారు.