ICC Rankings:సూర్యదే అగ్రస్థానం..6కు చేరిన కోహ్లీ

ICC Rankings:సూర్యదే అగ్రస్థానం..6కు చేరిన కోహ్లీ

లంకతో జరిగిన ఫస్ట్ వన్డేలో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ..వన్డే ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానానికి చేరుకున్నాడు. 2 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకుకు చేరుకున్నాడు. తొలి వన్డేలో  సూపర్ హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ 8వ స్థానాన్ని దక్కించుకున్నాడు. బౌలింగ్లో 2 వికెట్లు సాధించిన సిరాజ్..18వ స్థానానికి చేరుకున్నాడు. ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించిన లంక కెప్టెన్ దసున్ శనక 20 స్థానాలు మెరుగుపరచుకుని 61వ ర్యాంకులోకి నిలిచాడు. 

టీ20ల్లో  సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో చివరి టీ20లో సెంచరీ చేసిన సూర్య  తన పాయింట్లను మరింతగా పెంచుకున్నాడు. టీ20ల్లో ఆల్ రౌండర్ల విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హసన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.  బౌలింగ్ విభాగంలో అఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 

టెస్టుల్లో బ్యాటింగ్ విభాగంలో రిషబ్ పంత్ 6వ స్థానంలో ఉండగా..రోహిత్ శర్మ 10వ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో కమిన్స్  టాప్ 1లో ఉన్నాడు. బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా నెంబర్ వన్లో ఉన్నాడు. అశ్విన్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.