చెత్త.. ఫుడ్ వేస్ట్ విషయంలో పబ్లిక్ ఆలోచన ఎలా ఉంది.. పబ్లిక్ ఎలా బిహేవ్ చేస్తుంది అనటానికే ఈ వీడియోనే సాక్ష్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు రగిలిపోతున్నారు.. చెత్త మనుషులు.. చెత్త ఆలోచనలు.. మిమ్మల్ని బెల్ట్ తో కొట్టాలి రా.. మినిమం కామన్ సెన్స్ ఉండాలా వద్దా అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. బహిరంగ ప్రదేశాల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్లను.. ఫుడ్ వేస్ట్ గా మార్చేసిన ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. దీనిపై నెటిజన్లు రియాక్షన్స్ ఏంటో తెలుసుకుందామా..
హిమాచల్ ప్రదేశ్ లోని ఫేమస్ టూరిస్ట్ సిటీలో కొత్తగా ఏర్పాడు చేసిన పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన కొద్ది సేపటికే చెత్త కుప్పగా మార్చేసిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారితీసింది. టూరిస్టులు మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్రజా సౌకర్యంకోసం ఉంచిన పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ ను దుర్వినియోగం చేశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Himachal govt installs a charging point in Manali for tourists to charge phones and gadgets, and within hours people turn it into a dustbin. No Swachh Bharat or any scheme can fix this nation, only an iron fist policy can bring change. pic.twitter.com/EyTuv0eqn2
— Nikhil saini (@iNikhilsaini) May 2, 2026
నిఖిల్ సైనీ అనే X యూజర్ మనాలి లాంటి ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం ఉంచిన ఇలాంటి ఏర్పాట్లను దుర్వినియోగం చేసిన పౌరుల సోషల్ రెస్పాన్సిబిలిటీని ప్రశ్నిస్తూ Xలో పోస్ట్ చేశారు. నిఖిల్ పోస్ట్ గంటల్లోనే వైరల్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా యూజర్లనుంచి పెద్ద ఎత్తున స్పందనలు వెల్లువెత్తాయి. టూరిస్టుల బాధ్యతారాహిత్యంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
►ALSO READ | స్మార్ట్ మీటర్లు పగిలిపోతున్నయ్.. ఉత్తరప్రదేశ్లో ఊరూరా వ్యాపిస్తున్న మహిళల ఆందోళనలు
నెటిజన్లు స్పందిస్తూ.. పరిశుభ్రతను పాటించడంలో దేశ పౌరులు విఫలమయ్యారు. ప్రజల బాధ్యతయుతమైన భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు సక్సెస్ కావడం అసాధ్యం.. రోజురోజుకు పౌరుల్లో కనీస సోసల రెస్పాన్సిబిలీటీ తగ్గిపోతుంది.. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, జరిమానాలు విధించాలి అప్పుడే వారికి తెలిసి వస్తుందంటూ కామెంట్లు పెట్టారు.
Himachal govt installs a charging point in Manali for tourists to charge phones and gadgets, and within hours people turn it into a dustbin. No Swachh Bharat or any scheme can fix this nation, only an iron fist policy can bring change. pic.twitter.com/EyTuv0eqn2
— Nikhil saini (@iNikhilsaini) May 2, 2026
మరికొందరు మనాలి లాంటి ఎప్పుడూ రద్దీగా ఉంటే టూరిస్టు ప్లేస్ లలో చెత్త నిర్వహణ సరిగ్గా లేదు.. అక్కడ సరియైన డస్ట్ బిన్ ఏర్పాటు చేయకపోవడం కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని వాదించారు.
ఇక నెట్టింట జరుగుతున్న ఈ చర్చ మన దేశంలో టూరిస్ట్ ప్లేస్ లలో తరుచుగా ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దంపడుతుంది. టూరిస్టుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మౌలిక సదుపాయాలను పెంచాల్సి ఉంటుంది. మనాలి లాంటి ఫేమస్ టూరిస్టు ప్లేస్ లలో సీజనల్ గా పర్యాటకులుతాకిడికి అనుగుణంగా పారిశుధ్య వ్యవస్థ ప్రజా సౌకర్యాలు పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది.
