బీజేపీ పాలనలో దేశంలో పేదరికం తగ్గింది: మంత్రి కిషన్ రెడ్డి

బీజేపీ పాలనలో దేశంలో పేదరికం తగ్గింది:  మంత్రి కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు:  బీజేపీ పాలనలో దేశంలో పేదరికం తగ్గిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. దేశ భవిష్యత్​కోసం నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు.

బుధవారం ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా భారత్​కరోనాను హ్యాండిల్​ చేసిందన్నారు. ప్రధాని మోదీ జాతీయ రహదారులను విస్తరించి, అన్ని నగరాలకు కనెక్టివిటీని పెంచారని చెప్పారు. పర్యటనలో కిషన్​రెడ్డితో బీజేపీ నేతలు రమేశ్​రామ్, సదానంద గౌడ్, జమాల్పూర్ నందు, నవీన్ గౌడ్, కంచి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.