దుబాయ్: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఫిబ్రవరి)’ అవార్డును గెలుచుకున్నాడు. గత నెలలో మూడు టెస్ట్లు ఆడిన అశ్విన్.. సెకండ్ మ్యాచ్ లో 106 రన్స్ చేయడంతో పాటు, థర్డ్ టెస్ట్ లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మూడు మ్యాచ్ల్లో కలిపి తమిళనాడు స్పిన్నర్ 24 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇండియా... ఇంగ్లండ్పై సిరీస్ నెగ్గడంతో పాటు ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ కు క్వాలిఫై అయ్యింది. ఓవరాల్ గా సిరీస్ మొత్తంలో 189 రన్స్, 32 వికెట్లతో సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టిన అశ్విన్కు క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో ఓట్లు వేసి గెలిపించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (మూడు టెస్ట్ల్లో 333 రన్స్, 6 వికెట్లు), కైల్ మేయర్స్ (210 రన్స్) రేస్లో వెనుకబడిపోయారు. ఇక విమెన్స్ కేటగిరీలో ఇంగ్లండ్ ప్లేయర్ టామీ బ్యూమోంట్కు ఈ పురస్కారం లభించింది.

