ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పంజా.. వామప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాపై ఇండియా గెలుపు

ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పంజా.. వామప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాపై ఇండియా గెలుపు

నవీ ముంబై: టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంగిట చివరి సన్నాహక పోరులో టీమిండియా దంచికొట్టింది. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన వామప్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  30 రన్స్ తేడాతో గెలిచిన ఆతిథ్య జట్టు మెగా టోర్నీలో బరిలోకి దింపే తుది జట్టుపై పూర్తి క్లారిటీ తెచ్చుకుంది. ఇషాన్ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (20 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 53) మెరుపు ఫిఫ్టీతో ఓపెనర్ స్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖాయం చేసుకోగా.. గాయం నుంచి కోలుకొని వచ్చిన హైదరాబాదీ తిలక్ వర్మ (19 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45) ఫామ్ నిరూపించుకొని వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనకు తిరుగులేదని చాటి చెప్పాడు.

ఈ ఇద్దరి ధనాధన్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలుత ఇండియా 20 ఓవర్లలో 240/6 స్కోరు చేసింది. అభిషేక్ (24) కాస్త స్లోగా ఆడగా ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫిఫ్టీ తర్వాత అతను రిటైర్ అవ్వగా బరిలోకి దిగిన తిలక్ కూడా ఖతర్నాక్ షాట్లతో అలరించాడు. ఫిఫ్టీ చేసేలా కనిపించిన అతను యాన్సెన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బౌల్డ్ అవ్వగా.. సూర్యకుమార్ (30), రింకూ సింగ్ (16) ఉన్నంతసేపు ఫర్వాలేదనిపించారు. 

అక్షర్ పటేల్ (35 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), హార్దిక్ పాండ్యా (30) కూడా ధాటిగా ఆడటంతో ఇండియా భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సఫారీ టీమ్ ఓవర్లన్నీ ఆడి 210/7 స్కోరు మాత్రమే చేసింది. ట్రిస్టాన్ స్టబ్స్ (45 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌),  రికెల్టన్ (44), మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ (38), జేసన్ స్మిత్ (38), యాన్సెన్ (31) రాణించారు. ఇండియా బౌలర్లలో బుమ్రా రెస్ట్ తీసుకోగా తిలక్, అభిషేక్ సహా తొమ్మిది మంది బౌలింగ్ చేశారు. అభి రెండు వికెట్లు పడగొట్టాడు.