న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నమెంట్‌లో.. ఇండియాకు రెండు సిల్వర్ మెడల్స్ లభించాయి. శనివారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో మానవ్ ఠక్కర్‑అర్చన కామత్ జోడీ 3‑11, 3‑11, 6‑11తో చైనీస్ జంట వాంగ్ చుకిన్‑చెన్ జిన్‌టోంగ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. ఇక విమెన్స్ డబుల్స్ ఫైనల్లోనూ సుతీర్థ‑ఐహిక 6‑11, 11‑8, 10‑12, 7‑11తో జెంగ్ రుయ్‑కౌ మన్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో సెకండ్ ప్లేస్‌తో సిల్వర్ మెడల్‌ను సాధించారు. ఆదివారం నుంచి జరిగే సింగపూర్ స్మాష్ టోర్నీలో ఇండియన్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

