ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

ఢిల్లీ: కలకత్తా నుంచి ఢిల్లీ వచ్చిన ఇండిగో వీటీ– ఐఎంజీ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం కదలికల్లో తేడాను సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో రన్​వేపై ల్యాండ్​ అవుతున్న టైంలో ప్రమాదవశాత్తు విమానం తోక నేల భాగాన్ని తాకింది. 

ఫ్లైట్​ మాత్రం సేఫ్​గా ల్యాండ్​ అయ్యింది. దీంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 11న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్​పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని కొంత భాగం దెబ్బతినడంతో సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చిందని డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)​ ఓ ప్రకటనలో తెలిపింది. 

ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వారంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీజీసీఏ తెలిపింది. విమానం నడిపిన పైలెట్లను ప్రస్తుతం విధుల నుంచి పక్కనపెట్టినట్టు పేర్కొంది.