మే లోపు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మే లోపు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నియోజకవర్గంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆదివారం వీడీఓఎస్ కాలనీలోని తన క్యాంపు ఆఫీసులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.  

అనంతరం ఖమ్మం సిటీలోని పీఆర్టీయూ భవన్‌‌‌‌‌‌‌‌లో మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ వ్యవస్థాపకుడు దివంగత సామినేని హిమవంతరావు విగ్రహాన్ని  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు.