ఇన్స్ట్రాగ్రామ్ స్టార్ అనామికా బిష్ణోయ్ను కాల్చి చంపిన భర్త

 ఇన్స్ట్రాగ్రామ్ స్టార్ అనామికా బిష్ణోయ్ను కాల్చి చంపిన భర్త

ఆమె పేరు అనామికా బిష్ణోయ్.. మామూలుగా అయితే తెలియకపోవచ్చు.. అదే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మాత్రం మంచి పరిచయం. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజస్థాన్ కు చెందిన అనామికా బిష్ణోయ్ నిత్యం ఇన్స్టాలో వీడియోలు పోస్టు చేయటమే కాకుండా టూర్లు తిరుగుతూ అక్కడి విశేషాలను నెటిజన్లతో పంచుకుంటుంది. అంతేకాకుండా రెగ్యులర్ గా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ.. ఫాలోవర్స్ కు సమాధానం చెబుతూ ఉంటుంది. ఇన్స్టా ఇన్ ఫ్లుయెన్సర్ గా గుర్తింపు పొందిన అనామికా బిష్ణోయ్ ను.. ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపిన ఘటన సంచలనం మారింది. 

రాజస్థాన్ రాష్ట్రం ఫలోడిలో నివాసం ఉంటుంది అనామికా బిష్ణోయ్. కరోనా టైంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్ల కాపురంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. ఇన్ స్ట్రా రీల్స్, వీడియోలపై భర్తతో గొడవల కారణంగా.. కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. భార్య అనామికా తీరుపై ఆగ్రహంతో.. అసహనంగా ఉన్న భర్త.. ఇన్ స్ట్రా రీల్స్ విషయంలో.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంపై పలుసార్లు హెచ్చరించాడు. అయినా అనామికా తీరులో మార్పు రాలేదు. దీంతో దూరంగా ఉంటున్నారు ఇద్దరూ.

భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నా.. భార్య అనామికా బిష్ణోయ్ పై కోపం తగ్గలేదు భర్తకు.. దీంతో 2024, ఫిబ్రవరి 25వ తేదీ మధ్యాహ్నం అనామికా నిర్వహిస్తున్న లేడీస్ కలెక్షన్ షాపు దగ్గరకు వచ్చిన భర్త.. తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. సీసీ కెమెరాలో అనామికాపై కాల్పుల సంఘటన అంతా రికార్డ్ అయ్యింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. పదేళ్ల వయస్సు ఉన్న కుమారుడితో అనామికా కొన్ని రోజులుగా విడిగా ఉంటుంది. 

ALSO READ :- ప్రజావాణిలో 16 డిపార్ట్మెంట్స్కు సంబంధించిన ప్రత్యేక కౌంటర్లు

ప్రస్తుతం అనామిక భర్త మహిరాం పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. అతని కోసం గాలిస్తున్నారు. ఇన్ స్ట్రా ఇన్ ఫ్లుయెన్సర్ గా గుర్తింపు పొందిన అనామిక హత్యతో ఆమె ఫాలోవర్స్ షాక్ అయ్యారు. సంతాపం ప్రకటిస్తున్నారు.