ఈ నూడిల్స్ చెప్పుల్ని ఎప్పుడైనా చూశారా..?

ఈ నూడిల్స్ చెప్పుల్ని ఎప్పుడైనా చూశారా..?

చెప్పుల్లో రకరకాల ఫ్యాషన్లు ఉంటాయి. అయితే వాటిలో ఈ తరహా ప్యాషన్ చెప్పులు చూసుండరు. ఎందకంటే ఈ చెప్పులు నూడిల్స్ చెప్పులు. నూడిల్స్ తో చేసిన చెప్పులు మాత్రం కాదులేండి అంటూ సదరు కంపెనీ చెబుతున్నా..నెటిజన్లు మాత్రం తనదైనస్టైల్లో సెటైర్లు వేస్తున్నారు.

ప్యాషన్ పిచ్చి పీక్స్ కు చేరితే ఎలా ఉంటుందో ఇదిగో ఇక్కడ చెప్పుల్ని చూస్తే సరిపోతుంది. ప్రముఖ ప్యాషన్ దిగ్గజం డైట్ ప్రద బ్రాండెడ్ చెప్పుల్ని మార్కెట్ లో రిలీజ్ చేసింది. ఆ చెప్పుల్ని బొట్టెగా వెనెటా అనే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ యొక్క ప్రీ ఫాల్ నుంచి సేకరించి ప్రత్యేకంగా తయారు చేసినట్లు సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రీపాల్ 2020 ఫ్యాషన్ షోలో ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంచిన ఈ చెప్పుల డిజైన్లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లక్షరూపాయల ఖరీదైన ఈ చెప్పులు వేసుకుంటే పాదాలు సున్నితంగా తయారవుతాయని ప్రమోట్ చేస్తుంది.

అయితే ఈ చెప్పుల డిజైన్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ చెప్పులు చికెన్ తో చేశారా లేదంటే రొయ్యలతో చేశారాని అని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేస్తుంటే, మరో నెటిజన్ ఆ చెప్పులు లక్ష రూపాయలు పెట్టికొనడం వేస్ట్..చెప్పులు కాదు అవి చికెన్ ఫ్లేవర్ వాసన వస్తుందని సెటైర్లు వేస్తున్నారు.