ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడితే కేసు పెట్టారు. ఇక నుంచి క్వాలిటీ గురించి ప్రశ్నించను.. కల్తీ ఆహారాన్నే ఇష్టపడతానంటూ ప్రముఖ యూట్యూబర్ నలినీ ఉనగర్ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. ఫుడ్ సేఫ్టీ (FSSAI) విషయంలో చేసిన పోస్టుపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారని.. ఈ స్థాయిలో ఇంత ఒత్తిడి భరించలేనని 2026 ఏప్రిల్ 02న ఎక్స్ లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
లక్షల్లో ఫాలోవర్లు ఉన్న నలినీ ఉనగర్ చేసిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పై నేను చేసిన పోస్టుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత నేను ఆ పోస్టులను డిలీట్ చేశాను. అవే కాదు అలాంటి పోస్టులను చాలా వరకు తొలగించాను.
తను ఆల్ రెడీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నానని.. లీగల్ సవాళ్లు తనను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక నుంచి సున్నితమైన అంశాలపై పోస్టులు చేయడం మానేస్తా.. భవిష్యత్తులో నేను మౌనంగా ఉండటం మీరు చూస్తారు. ఎందుకంటే ఈ రకమైన స్ట్రెస్ ను భరించలేను అంటూ ట్వీట్ చేశారు.
ALSO READ : ఆపరేషన్ స్టోలెన్ కిట్ క్యాట్ ట్రాకర్
Delhi Police have filed an FIR against me.
— Nalini Unagar (@NalinisKitchen) April 2, 2026
I had written about an FSSAI issue. I have already taken down those posts and am also removing many others.
I already have too many things going on in my life.
In the future, you may see me silent. I cannot handle this level of stress…
కల్తీ గురించి మాట్లాడితే కేసు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారామె. నాకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఇక నుంచి..
- నేను కల్తీ పన్నీర్ ఇష్టపడతా.
- ఆహారంలో యూరియా ఉంటే ఇష్టపడతా.
- కృత్రిమ నెయ్యిని ఇష్టపడతా.
- సర్ఫ్ డిటర్జెంట్ కలిసిన పాలను ఇష్టపడతా.
- ఫేక్ మసాలను ఇష్టపడతా.
- ఆహారంలో కృత్రిమ రంగులను కలపడాన్ని ఇష్టపడతా.
- గోధుమ పిండిలో చాక్ పౌడర్ ఉంటే ఇష్టపడతా.
- ప్లాష్టిక్ బియ్యాన్ని ఇష్టపడతా.
- విషపూరితమైన ప్రిజర్వేటివ్స్ ను ఇష్టపడతా.
- నన్ను ఏవైతో మెల్లమెల్లగా చంపేస్తాయో వాటిని ఇష్టపడతా.
- ఎందుకంటే వాటికి వ్యతిరేకంగా మాట్లాడితే నేరం కదా..
అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అంశంపై ఆమె చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు.
FIR filed on me.
— Nalini Unagar (@NalinisKitchen) April 2, 2026
So starting from today,
I love fake paneer
I love urea in food
I love synthetic ghee
I love detergent in milk
I love fake spices
I love artificial colours in food
I love chalk powder in flour
I love plastic rice
I love toxic preservatives
I love everything that…
