ఇరాన్ లో అడుగుపెట్టే ఒక్కడు కూడా బతికి బయటకు వెళ్లడు : అమెరికా సైన్యానికి ఇరాన్ డెడ్లీ వార్నింగ్

ఇరాన్ లో అడుగుపెట్టే ఒక్కడు కూడా బతికి బయటకు వెళ్లడు : అమెరికా సైన్యానికి ఇరాన్ డెడ్లీ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు ఓ వైపు వార్నింగ్స్ పై వార్నింగ్స్ ఇస్తుంటే.. ఇరాన్ మాత్రం అంతకు మించి మాటల తూటాలు పేల్చుతుంది. అసలు సిసలు యుద్ధం ఎలా ఉంటుందో రాబోయే రెండు, మూడు వారాల్లో చూస్తారంటూ ఇరాన్ దేశానికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ విన్నారో లేదో.. ఇరాన్ మాత్రం అంతకు మించి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. 

భూతల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని.. ఇరాన్ భూ భాగంలో అడుగుపెట్టే ఒక్క శత్రు సైనికుడు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లకూడదు.. ఇరాన్ గడ్డ నుంచి ప్రాణాలతో బతికి బయటకు వెళ్లకూడదు అంటూ తమ సైన్యానికి పిలుపునిస్తూ.. అమెరికాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.

ఇరాన్ ప్రభుత్వ మీడియా  ప్రెస్ టీవీ ప్రకారం..  ఇరాన్ పవర్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థ తీవ్రంతా దెబ్బతిన్నదని అమెరికా వాదనలను ఇరాన్ తిరస్కరించింది. ఇరాన్ సైనికబలంపై అమెరికి నిఘా సమాచారం తప్పు అని ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇస్లామిక్ సైనిక స్థావరాల సమాచారం అమెరికా దగ్గర లేదని అన్నారు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించే  ఇరాన్ కేంద్రాలను ధ్వంసం చేశామన్న ట్రంప్ వాదనలను తోసిపుచ్చారు. సెంట్రల్ ఖతం అల్-అన్బియా ప్రధాన కార్యాలయం ఇరాన్ సైనిక కార్యకలాపాల కమాండ్ యూనిట్. ఇది ఇరాన్ సైన్యం ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC) మధ్య కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. 

యుద్దం ప్రారంభించింది అమెరికానే.. ప్రతీకారం తప్పదు..మీరు ప్రశ్చాత్తాప పడి, లొంగిపోయే వరకు  యుద్దం కొనసాగుతుందని.. ఇప్పటికే అమెరికాను చావు దెబ్బ కొట్టాం.. ఇక ముందు కూడా మరిన్ని దాడులు చేస్తాం.. సిద్దం ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.  

ALSO READ : యుద్ధం వెనుక కుట్ర

అమెరికా ప్రజలనుద్దేశించి ట్రంప్ ఏమన్నారంటే.. 

గురువారం ఉదయం ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన అనంతరం అమెరికాను ఉద్దేశించి ప్రసంగిస్తూ..ఇస్లామిక్ రిపబ్లిక్‌పై  నిర్ణయాత్మక దెబ్బ కొట్టినందుకు ట్రంప్ అమెరికా సైన్యాన్ని ప్రశంసించారు.ఈ దాడుల ప్రధాన లక్ష్యం పూర్తి కావస్తోందని అన్నారు. ఆ సమయంలో ఇరాన్ సముద్ర, వైమానిక శక్తులను క్రమపద్ధతిలో నిర్వీర్యం చేశారని, అలాగే ఇరాన్  సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఇరాన్ నౌకాదళం నాశనమైంది.దాని వైమానిక దళం శిథిలమైంది. ఇరాన్ దేశ నేతలు,  చాలామంది ఉగ్రవాదులు మరణించారు.అని ట్రంప్ ప్రకటించారు.