బండి భగీరథ్‌‌కి మధ్యంతర బెయిల్‌‌..ఇంజనీరింగ్ పరీక్షల నేపథ్యంలో మంజూరు

బండి భగీరథ్‌‌కి మధ్యంతర బెయిల్‌‌..ఇంజనీరింగ్ పరీక్షల నేపథ్యంలో మంజూరు

హైదరాబాద్‌‌, వెలుగు: పోక్సో కేసులో బండి భగీరథ్‌‌కు బెయిల్ లభించింది. ఇంజనీరింగ్ పరీక్షల నేపథ్యంలో శనివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌‌ను మంజూరు చేస్తూ మల్కాజిగిరి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో పూచికత్తులు దాఖలు చేసిన అనంతరం బండి భగీరథ్‌‌ శనివారం మధ్యాహ్నం చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ నెల 25న కోర్టులో హాజరైన తరువాత చర్లపల్లి జైలు రిమాండ్‌‌లోకి వెళ్లనున్నాడు. కాగా, మైనర్‌‌‌‌పై లైంగిక దాడి చేశాడనే ఫిర్యాదుతో మే16న పేట్‌‌బషీరాబాద్‌‌ పోలీసులు బండి భగీరథ్‌‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి నెల రోజులుగా భగీరథ్‌‌ చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.