- వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్
- ప్రతిభ చూపిన గురుకులాల విద్యార్థులు
వెలుగు, నెట్వర్క్: ఇంటర్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ముఖ్యంగా గురుకులాల విద్యార్థులు టాపర్ స్థానాలకు పోటీ పడ్డారు. రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 82.12 శాతం సాధించగా, ఫస్ట్ఇయర్లో 71.31 శాతంతో 5వ స్థానంలో నిలిచినట్లు జిల్లా ఇంటర్ పరీక్షల నిర్వహణ అధికారి వీరేందర్ తెలిపారు. జనగామ జిల్లాలో 70.92 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు.
మహబూబాబాద్ జిల్లాలో 49.11 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండ జిల్లాలో సెకండ్ ఇయర్లో 78.57 శాతం పర్సంటేజీతో రాష్ట్రంలో జిల్లా 8వ స్థానంలో ఉండగా, ఫస్ట్ ఇయర్లో 69.16 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 7వ స్థానంలో నిలిచింది. వరంగల్ జిల్లాలో సెకండియర్లో 60.80 శాతంతో 32వ శాతం, ఫస్ట్ఇయర్లో 52.81 శాతం పర్సంటేజీతో రాష్ట్రంలో 30 స్థానంలో ఉన్నది.
ఖమ్మం జిల్లాలో ఫస్టియర్ ఫలితాల్లో 72.06 శాతంతో రాష్ట్రంలో 4వ స్థానంలో ఉండగా, సెకండియర్లో 81.60 శాతంతో 6వ స్థానంలో నిలిచింది. కాగా, గురుకులాలతో పాటు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు.భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్లో 77.80 శాతం, ఫస్ట్ ఇయర్లో 62.71శాతం స్టూడెంట్స్ రిజల్ట్ సాధించారు. రాష్ట్ర స్థాయిలో సెకండ్ ఇయర్లో తొమ్మిదో స్థానంలో, ఫస్ట్ ఇయర్లో 11స్థానంలో జిల్లా నిలిచింది.
