పంజాగుట్ట, వెలుగు : పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో బుధవారం ఇంటర్నేషనల్ రేడియోగ్రఫీ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ఎన్. బీరప్ప మాట్లాడుతూ.. రోగ నిర్దారణలో రేడియాలజీ, రేడియోగ్రఫీ ఉపయోగాన్ని వివరించారు. నిమ్స్ ట్రామా సెంటర్ నుంచి మెయిన్ గేట్ వరకు ‘రేడియేషన్ సేఫ్టీ అవేర్ నెస్ వాక్’ను నిర్వహించారు.
అనంతరం నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో సెమినార్ జరిగింది. కార్యక్రమంలో డీన్ డాక్టర్ లీజా రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్రిజిస్ట్రార్ డాక్టర్ శాంత్వీర్, ప్రొఫెసర్డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ జోత్స్న, డీఎంవోలు లక్ష్మీ భాస్కర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
