తీవ్ర ఎండలకు జలాశయాల నీటి మట్టం తగ్గటంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు ఇది శుభవార్త. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ కు వరద ప్రవాహం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
హిమాయత్ సాగర్ కు 800 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు అధికారులు చెప్పారు. జలాశయాల నీటిమట్టాలు, ఇన్ ఫ్లోలను నిరంతరం పర్యవేక్షిస్తున్న జలమండలి.. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీటి ప్రవాహం పెరుగుతోందని తెలిపారు. మరోవైపు ఉస్మాన్ సాగర్ కు కూడా వరద నీరు మెల్ల మెల్లగా వచ్చి చేరుతున్నట్లు చెప్పారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. అన్ని ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
