ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ (ఏఏఐసీఎల్ఏఎస్) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 62.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ 12వ తరగతి పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్తులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది. హిందీ/ ఇంగ్లిష్ భాష లేదా స్థానిక భాషలో మాట్లాడ గలిగే సామర్థ్యం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్సర్వీస్మన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 11.
లాస్ట్ డేట్: జులై 02.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.aaiclas.aeroను సందర్శించండి.
