Sreeleela: ‘శ్రీ శ్రీ’ అంటూ కార్తీక్.. ‘థ్యాంక్యూ స్వీటెస్ట్’ అని శ్రీలీల.. ఒక్క ఫోటోతో మళ్లీ ట్రెండింగ్‌లో

Sreeleela: ‘శ్రీ శ్రీ’ అంటూ కార్తీక్.. ‘థ్యాంక్యూ స్వీటెస్ట్’ అని శ్రీలీల.. ఒక్క ఫోటోతో మళ్లీ ట్రెండింగ్‌లో

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలకు సంబంధించిన డేటింగ్ రూమర్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవలే వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, కేవలం కుటుంబాల మధ్య వృత్తిపరమైన పరిచయం మాత్రమే ఉందని శ్రీలీల తల్లి స్పష్టత ఇచ్చినప్పటికీ.. మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. శ్రీలీల-కార్తీక్ మధ్య బలమైన బాండింగ్ ఉందంటూ బాలీవుడ్ సినీ వర్గాల్లో టాక్ ఊపందుకుంది. ఇంతకీ.. ఇప్పుడు ఈ జంట వైరల్ అవ్వడానికి గల కారణం ఏంటనేది వివరంగా తెలుసుకుందాం.

ఆదివారం (జూన్ 14, 2026న) శ్రీలీల తన 25వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రీలీలకు విషెష్ చెబుతూ, కార్తీక్ సోషల్ మీడియాలో ఓ క్యూట్ ఫోటో షేర్ చేశాడు. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో శుభాకాంక్షలు తెలిపాడు. ఇంకేముంది ఆ ఫోటో ఇరువురి అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇదే సమయంలో నెటిజన్ల దృష్టిని కూడా ఆకర్షించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కార్తీక్ పోస్ట్ చేసిన ఆ ఫొటోలో కార్తీక్ బైక్ నడుపుతుండగా, వెనుక కూర్చున్న శ్రీలీల ఇద్దరూ బైక్ రియర్ వ్యూ మిర్రర్‌లో చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ ఫోటోకు ‘హ్యాపీ బర్త్‌డే శ్రీ శ్రీ‌‌‌‌’ అంటూ కార్తీక్ క్యాప్షన్ ఇచ్చారు. ఆ వెంటనే శ్రీలీల స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ స్వీటెస్ట్‌‌‌‌’ అంటూ రిప్లై ఇచ్చింది. ముఖ్యంగా లవ్ సింబల్ జోడించింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు వీరి రిలేషన్‌షిప్‌పై చర్చ మొదలుపెట్టారు.

‘మరో సూపర్ బ్లాక్‌బస్టర్ జంట రెడీ అయింది’, ‘ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు కనిపిస్తున్నారు’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఫొటోలో కనిపించిన బైక్ మిర్రర్‌పై ఉన్న ‘Objects in the mirror are closer than they appear’ అనే పదాలను ప్రస్తావిస్తూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక కార్తీక్-శ్రీలీల మధ్య ఉన్న బంధం స్నేహమా? ప్రేమా? అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే వారి ప్రతి సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో కొత్త చర్చలకు దారితీస్తూనే ఉంది.

అయితే ఇప్పటివరకు కార్తీక్ ఆర్యన్, శ్రీలీల తమ రిలేషన్‌షిప్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వీరి మధ్య ఉన్న బంధం స్నేహమా? ప్రేమా? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. అయితే వీరిద్దరి ప్రతి సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో కొత్త చర్చలకు తెరలేపుతోంది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్, శ్రీలీల దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఓ రొమాంటిక్ డ్రామాలో కలిసి నటిస్తున్నారు. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీలీల బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SREELEELA (@sreeleela14)